Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై వీర్రాజు వీరంగం..!

By:  Tupaki Desk   |   17 Feb 2022 7:30 AM GMT
కేసీఆర్ పై వీర్రాజు వీరంగం..!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ బాస్ సోమువీర్రాజు ఫైర్ అయ్యారు.మామూలుగా కాదు ఓ రేంజ్ లో ! గ‌త కొద్దిరోజులుగా బీజేపీని తిట్టిపోస్తున్న కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ నోరు పారేసుకోవ‌ద్దు అని హితవు చెబుతూనే ఈర్రాజు ఈరంగం ఆడేశారు.ఆ రోజు తెలంగాణ ఏర్పాటు విష‌య‌మై కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు సాష్టాంగ ప్ర‌ణామం చేసిన విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌ద‌ని అన్నారు.అటువంటి వ్య‌క్తికి ప్ర‌ధాని మోడీని విమ‌ర్శించే హ‌క్కే లేద‌ని తేల్చేశారు.

ఇక దీనిపై కేసీఆర్ వ‌ర్గం ఏమంటుందో ? మ‌రి! ఇప్ప‌టికే కేసీఆర్ పై అటు బండి సంజ‌య్ కూడా మండిప‌డుతున్నారు.ఆయ‌న‌పై రాజ్యాంగ ధిక్క‌ర‌ణ కింద కేసులు న‌మోదు చేయిస్తామ‌ని, కోర్టు ధిక్క‌ర‌ణ కింద చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నామ‌ని అంటూ రోజూ ఏదో ఒక మాట తెర‌పైకి తెచ్చి వివాదం పెంచుతున్నారు.ఎంపీ సంజయ్ కు తోడుగా సోము వీర్రాజు అనే మాజీ ఎంఎల్సీ కూడా తోడ‌య్యాడు.ఇంకేం మాట‌ల‌కు హ‌ద్దే ఉండదు.

వాస్త‌వానికి కేసీఆర్ ఎప్ప‌టి నుంచో బీజేపీతో బంధాలు తెంపుకోవాల‌ని అనుకుంటున్నారు.ధాన్యం కొనుగోళ్లు (యాసంగికి సంబంధించి)కు సంబంధించి ఎటువంటి క్లారిఫికేష‌న్ కేంద్రం ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ రైతుల త‌ర‌ఫున దీక్ష‌లు చేశారాయన. ధ‌ర్నాలు చేశారాయ‌న.ఇవ‌న్నీ ఓ కొలిక్కి రాక‌ముందే సార్వ‌త్రిక బ‌డ్జెట్ వ‌చ్చింది.ఇందులో కూడా తెలంగాణ‌కు ఇస్తమ‌న్న పైస‌లు ఇయ్య‌లే అంటూ మ‌ళ్లీ కోపం అయ్యారు కేసీఆర్.

ఇక దేశంలో స‌మాఖ్య స్ఫూర్తి కొర‌వ‌డింద‌ని, రాజ్యాంగం కూడా మార్చుకోవాల‌ని అన్నారు. ఇవే మాటలు అటు ద‌ళిత సంఘాల‌కు ఇటు బీజేపీ నాయ‌కుల‌కూ కోపం తెప్పించాయి.దాంతో అప్ప‌టి నుంచి కేసీఆర్ పై ముఖ్యంగా ఆయ‌న కోట‌రీపై వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు.

ఇక స‌మ‌తామూర్తి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు మోడీ వ‌చ్చినా జ్వ‌రం నెపంతో కేసీఆర్ వెళ్ల‌క‌పోవ‌డంపై కూడా బీజేపీ మండిప‌డింది.ఓ ప్ర‌ధానికి ఇచ్చే మ‌ర్యాద ఇదేనా అని కూడా అంటోంది. ఇవ‌న్నీ కూడా కేసీఆర్ కూ బీజేపీకీ మ‌ధ్య దూరం పెంచాయి.అయితే ఇవేవీ న‌మ్మేందుకు వీల్లేని ప‌రిణామాలే అనిఇంకొంద‌రు రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

గ‌తంలో కూడా ఇదేవిధంగా రాజ‌కీయ తుఫానులు తీసుకువ‌చ్చి త‌రువాత సంబంధిత అంశాల ఊసే వదిలేసిన దాఖ‌లాలు ఎన్నో ఉన్నాయని ఉదాహ‌ర‌ణల‌తో స‌హా వివ‌రిస్తున్నారు.ఏదేమ‌యిన‌ప్ప‌టికీ మోడీని,బీజేపీని మంత్రి త‌ల‌సాని సైతం విమ‌ర్శిస్తుండ‌డ‌మే మ‌రీ పెద్ద హంగామాలా అనిపిస్తోంది అని కూడా అంటున్నారు.ఇక సోము వీర్రాజు ఎపిసోడ్ లో సాష్టాంగ ప్ర‌ణామం అన్న‌ది త్వ‌ర‌లో మ‌రింత హైలెట్ అయ్యే ప‌దం కానుంది.. అదే ఇకపై నాయ‌కుల వ్య‌వ‌హార శైలికి ప్రామాణికం కానుంది.