Begin typing your search above and press return to search.
మన షిప్ ను వాళ్లు హైజాక్ చేశారు
By: Tupaki Desk | 3 April 2017 9:16 AM GMTమనదేశానికి చెందిన కార్గో షిప్ ఒకటి హైజాక్ కు గురైంది.సోమాలియా సముద్ర దొంగల చేతికి భారతదేశానికి చెందిన కార్గో షిప్ ఒకటి హైజాక్ అయిన విషయాన్ని అధికారులు సైతం నిర్దారిస్తున్నారు. ఏప్రిల్ ఒకటిన జరిగిన ఈ ఉదంతంలో కార్గోషిప్ లో 11 మంది వరకూ సిబ్బంది ఉన్నట్లుగా చెబుతున్నారు. దుబాయ్ నుంచి యమెన్ కు వెళుతుండగా.. సోమాలియాకు చెందిన కొందరు దుండగులు కార్గోషిప్ ను హైజాక్ చేసిన ఉదంతం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక కార్గోషిప్ లో ఉన్న 11 మంది ముంబయికి చెందిన మాండ్వీ ప్రాంతానికి చెందిన వారిగా చెబుతున్నారు. సోమాలియా సముద్రదొంగల చేతుల్లో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కార్గో షిప్ హైజాక్ కు గురైందన్న విషయాన్ని.. షిప్ కెప్టెన్ దుబాయ్ లో వెల్లడించటంతో ఈ విషయం అధికారులకు తెలిసింది.
ఈ హైజాక్ ఉదంతాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. షిప్ దుండగుల చేతికి వెళ్లిపోవటం.. అందులో ఉన్న పదకొండుమంది కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తమ వారిని కాపాడాలని కోరుకుంటున్నాయి. మరోవైపు.. ఈ ఉదంతం కేంద్రం రియాక్ట్ అవుతూ.. సముద్ర దొంగల చేతుల్లో నుంచి కార్గోషిప్ ను బయటకు తీసుకురావటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/