Begin typing your search above and press return to search.

పచ్చ పత్రికలు ఇంత బరితెగింపా? పచ్చి అబద్ధాలతో బ్యానర్ ఐటమ్స్?

By:  Tupaki Desk   |   23 Sep 2020 11:10 AM GMT
పచ్చ పత్రికలు ఇంత బరితెగింపా? పచ్చి అబద్ధాలతో బ్యానర్ ఐటమ్స్?
X
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ గాలి వీచింది. వైసీపీ ఏకంగా 51శాతం ఓట్లతో 151 ఎమ్మెల్యే సీట్లు.. 22 ఎంపీ సీట్లను కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది. ఈ భారీ విజయం చూశాక విశ్లేషకులు, టీడీపీ నేతలు సైతం ఇక టీడీపీ పని అయిపోయిందని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మానసికంగా కృంగిపోయాడనే టాక్ అంతటా వినిపించింది. వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు వృద్ధుడు అయిపోతాడని.. లోకేష్ పనికిరాడు అని.. లోకేష్ ను టీడీపీ వాళ్లే ఒప్పుకోవడం లేదు అని.. ఇలా రకరకాలుగా చర్చలు, విశ్లేషణలు ఏపీ రాజకీయాల్లో సాగాయి.

అయితే గత 6 నెలల నుంచి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేయాల్సిన పనిని.. పచ్చ పత్రికలు, పచ్చ కలర్స్ తో చానెల్స్ నడుపుతున్న వాటి యజమానులు భుజానకెత్తుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు అభూత కల్పనలతో విష ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుకోకుండా చేస్తున్నారని రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసిన ఎవరైనా ఇదే మాట అంటారు.

అయితే ఏపీ సీఎం జగన్ ఇలాంటివి పట్టించుకోకుండా తను అనుకున్నవి చేసుకుంటూ పోతున్నారు. నవరత్నాలకు బడ్జెట్ లేకున్నా ఏదో విధంగా ప్రజలకు ఇస్తుంటే.. టీడీపీ వాళ్లకు మతిపోతోంది. అప్పుల్లో ఉన్నా.. పైసా పుట్టని ఏపీలో కూడా జగన్ ఇన్ని సంక్షేమాలు చేయడంతో టీడీపీ బ్యాచ్ రగిలిపోతోందట.. దీంతో ఇప్పుడు కులాల మీద.. మతాల మీద చర్చలు పెడుతూ గందరగోళంలో పడేస్తున్నారని మేధావులు అంటున్నారు.

చంద్రబాబుకు ఇది మంచిది కాదని కూడా కొందరు సలహాలు ఇస్తున్నా.. ఆయనకు ఇచ్చే సలహాదారులు శాడిజంతో చంద్రబాబును ఆ భ్రమలో ముంచేస్తున్నారట. అందుకే చంద్రబాబు జూమ్ లో కులాలు, మతాల మీద ఫోకస్ చేస్తున్నాడని అంటున్నారు. చంద్రబాబు విజన్-2020 కులాలను, మతాలను రెచ్చగొట్టడమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అయితే రాష్ట్రంలో ఆదాయ వనరులు లేవు. దీంతో కేంద్రం నుంచి ఎంతో కొంత సహాయం అడగాలని ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నాడు. జగన్ కేంద్రంలో ఉన్న నంబర్ 2 అమిత్ షా అపాయింట్ మెంట్ తీసుకొని ఢిల్లీ వెళ్లి కలిశాడు. ఏపీ సీఎం జగన్, అమిత్ షా వన్ టు వన్ ఇద్దరు మాత్రమే రహస్యంగా మాట్లాడుకున్నారు. అక్కడ మూడో మనిషికి తావులేదు. అయితే ఏదో లోపల సీక్రెట్ మైక్ పెట్టినట్టు ఇంత పచ్చి అబద్ధాలతో జగన్ కు క్లాస్ పీకాడు అని బరితెగించి పచ్చపత్రికలు ఈరోజు రాస్తున్నాయంటే వాళ్ల అరాచకం జగన్ మీద ఏ విధంగా అర్థం చేసుకోవచ్చని పలువురు హితవు పలుకుతున్నారు.

సీఎం , హోంమంత్రి వన్ టు వన్ ఇద్దరు మాత్రమే మాట్లాడుకుంటే.. వాళ్లు ఎవరూ చెప్పకుండా ఆ భేటిలో ఏం జరిగిందనేది ఎలా బయటికి వస్తుంది..? ఎవరికీ రాని ఇన్ఫర్మేషన్ ఒక పచ్చ పత్రికకు ఎలా తెలుస్తుంది? ఇది ఎంత వరకు కరెక్ట్? ఆ పత్రికను నడుపుతున్న అపర మేధావులు ఆలోచన చేయాలని మేధావులు సూచిస్తున్నారు. త్వరలో ఆ పత్రిక యజమానుల మీద ఏదో విధంగా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు అనుకుంటున్నారంట.. చూద్దాం ఏమీ అవుతుందో..