Begin typing your search above and press return to search.

పళని స్వామి కాదు.. శశికళ బానిస

By:  Tupaki Desk   |   20 Feb 2017 4:22 AM GMT
పళని స్వామి కాదు.. శశికళ బానిస
X
ఇంత పెద్దమాటను మాకు మేముగా అనటం లేదు. కానీ.. ఇప్పుడీ మాట అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. పళనిస్వామి అన్నవెంటనే.. తమిళనాడు ముఖ్యమంత్రి అన్న దాని కంటే.. శశికళ బానిస అంటూ వికిపీడియాలో దర్శనమిస్తున్న వైనం ఇప్పుడు కనిపిస్తోంది. ప్రజల మద్దతు లేకుండా.. ముఖ్యమంత్రి అయిన పళనిస్వామిపై తమిళులకు ఉన్న ఆగ్రహం వికీపీడియాలో ఆయన పేరు స్థానే ఆయనకు కొత్త పేరును తెచ్చి పెట్టింది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన మీదున్న ఆగ్రహాన్ని కొందరు కాస్త విచిత్రంగా ప్రదర్శించారు. వికిపీడియాలో ఆయన పేరును కొట్టేసి.. ఆ స్థానంలో శశికళ బానిస అంటూ పేర్కొనటం గమనార్హం. శశికళకు.. పన్నీర్ కు మధ్య నడిచిన సీఎం కుర్చీ పోరులో.. పన్నీర్ కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కకుండా చేయటంలో శశికళ సక్సెస్ అయ్యారు.

అదే సమయంలో.. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి.. జైలుకు వెళ్లారు. తానుకూర్చోవాలనుకున్న సీఎం కుర్చీలో పన్నీర్ కూర్చోనీయకుండా చేశారన్న భావనలో ఉన్న శశికళ.. ఆయన్ను సైతం సీఎం కాకుండా చేసి.. తన విధేయుడైన పళనిస్వామిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంల పళని స్వామి మీద తమకున్న ఆగ్రహాన్ని ప్రదర్శించుకునేందుకు కొందరు వికిపీడియాలోఫిబ్రవరి 16న ఆయన పేరునుఎడిట్ చేసి.. శశికళ బానిసగా మార్చారు. దీనికి కొందరు నెటిజన్లు.. సోషల్ మీడియాలో షేర్ చేయటం ద్వారా.. ఇది వైరల్ గా మారింది.అనంతరం దీన్ని పళనిస్వామిగా మార్చేస్తూఎడిట్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/