Begin typing your search above and press return to search.
సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన సోదరుడు
By: Tupaki Desk | 24 Feb 2019 1:18 PM GMTఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఇటీవలే తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గతంలో బరిలో దిగిన సర్వేపల్లిలోని పరాజయపు పాఠాల నుంచి ఈ నిర్ణయం తీసుకున్న సోమిరెడ్డి ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఎపిసోడ్‌లో ఊహించని షాక్ తగిలింది. చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
టీడీపీ సీనియర్ నేత అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. అయితే, ఇక్కడ ఆయన్ను విజయం వరించిన సందర్భాలతో పాటుగా ఓటమి పాలైన ఉదంతాలే ఎక్కువగా ఉన్నాయి. సర్వేపల్లి నుంచి 1994, 1999లలో విజయం సాధించారు. అయితే వరుసగా ఆయన మూడుసార్లు ఓటమి పాలయ్యారు. 2004లో సోమిరెడ్డిపై కాంగ్రెస్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి 7వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. 2009లో కూడా కాంగ్రెస్ నుంచి ఆదాలనే సోమిరెడ్డిపై 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఐదువేల పైచీలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాగా, తాజాగా సోమిరెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకాణి గోవర్దర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామం సోమిరెడ్డిని షాక్ కు గురిచేసింది. కొద్దికాలం క్రితమే సోమిరెడ్డి బావ రామకోటరెడ్డి వైసీపీలో చేరారు. రామకోటరెడ్డి చేరికే సోమిరెడ్డికి ఎదురుదెబ్బగా భావిస్తున్న తరుణంలో..తాజా చేరిక మరింత షాక్ వంటిదని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలవడం, మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుకొని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి ముందుకు సాగుతున్న సోమిరెడ్డి ఈ పరిణామంతో ఇరుకున పడ్డట్లేనని చర్చించుకుంటున్నారు.