Begin typing your search above and press return to search.
ఆడోళ్ల గొడవలో తలదూర్చిన రెడ్డి గారు!
By: Tupaki Desk | 14 Aug 2017 4:37 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా.. ముక్కు సూటిగా మాట్లాడడంలో గానీ, అవతలి వాళ్లు ఎంతటి నాయకులనే విషయం ఏమాత్రం లెక్కలేకుండా.. తాను చెప్పదలచుకున్నది కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేయడంలో గానీ.. తనకంటూ ఒక స్టయిల్ ఉన్న నాయకురాలు అనే సంగతి అందరికీ తెలుసు. నిజానికి తెలుగుదేశం పార్టీలో ఎంతో సీనియర్లు అయిన, కొమ్ములు తిరిగిన నాయకులు కూడా రోజా ధాటికి తట్టుకోలేక, మళ్లీ మళ్లీ ఆమెతో తిట్టించుకోవడం కంటె.. మౌనంగా ఉండడం బెటరని, ఆమె జోలికి పోకుండా... ఉండిపోతున్నారు. అయితే.. నెల్లూరుకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తీరు మాత్రం చిత్రంగా ఉంది. తనకు ఏమాత్రం సంబంధంలేని విషయంలో ఆయన తలదూర్చి.. రోజా నిత్యం విమర్శించే నాయకుల జాబితాలోకి చేరిపోయారని అంతా అనుకుంటున్నారు. ఇద్దరు మహిళా నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉంటే.. సోమిరెడ్డి తగుదునమ్మా అంటూ తాను కూడా వారి గొడవలో తలదూర్చి అభాసు పాలవుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో రోజా.. తెలుగుదేశానికి చెందిన మంత్రి అఖిలప్రియ గురించి సహజంగానే కొన్ని విమర్శలు చేసింది. అఖిలకు కట్టూబొట్టూ కూడా తెలియవంటూ రోజా వ్యాఖ్యానించింది. దానికి అఖిలప్రియ కౌంటర్ కూడా ఇచ్చింది. తన వ్యక్తిగత విషయాల గురించి.. రోజా మాట్లాడడం సరికాదంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది. నిజానికి ఈ ఇద్దరి మధ్య గొడవ తనకు సంబంధించినది కాకపోయినప్పటికీ, అందులోకి సోమిరెడ్డి తల దూర్చారు. వరుసగా ఎన్నికల్లో గెలిచే సత్తాలేకుండా... ప్రజల్లో బలాన్ని నిరూపించుకోలేకపోతున్న నాయకుడిగా జనంలో ముద్రపడిపోయిన సోమిరెడ్డి.. ఏదో చంద్రబాబు ప్రాపకంతో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుని దానితోపాటూ మంత్రి పదవిని కూడా అధిరోహించి.. అందుకు కృతజ్ఞత వెలిబుచ్చడం అన్నట్లుగా.. చంద్రబాబుకు కోసం జగన్ ని, వైకాపా నాయకులను తిట్టడం ... అదే పనిగా ప్రతిరోజూ మీడియా ముందుకు రావడం పనిగా పెట్టుకున్నారనేది జనంలో ఉన్న అభిప్రాయం. ఆ క్రమంలో భాగంగానే.. ఆయన ఈ ఆడోళ్ల వివాదంలో కూడా తల దూర్చారు. తలదూర్చడమే కాదు.. చాలా అసభ్యంగా.. లేకిగా.. చీరకట్టుకోవడం నేర్పే ఇన్ స్టిట్యూట్ రోజా ప్రారంభించాలంటూ ఓ ఉచిత సలహా కూడా పారేశారు.
కాకపోతే.. అవతల ఉన్నది రోజా కావడంతో ఆయనకు తలబొప్పికట్టినట్టు కనిపిస్తోంది. తన విషయంలో ఇలాంటి లేకి వ్యాఖ్యలు చేసే సరికి రోజా సోమిరెడ్డిని ఒక రేంజిలో విమర్శిస్తున్నారు. ఏ సందర్భంలో ఆయనకు కౌంటర్ ఇవ్వకుండా విడిచిపెట్టడం లేదు. ఏదో చంద్రబాబు ముఖప్రీతికోసం జగన్ ను నాలుగు మాటలు అని ఊరుకోకుండా.. ఆడోళ్ల గొడవలో తలదూర్చి ఇబ్బందులు కొనితెచ్చుకున్నానే అని సోమిరెడ్డి ఫీలవుతుండవచ్చు.