Begin typing your search above and press return to search.
నందమూరి ఫ్యామిలీతో బాబుకు విభేదాల్లేవట!!
By: Tupaki Desk | 29 May 2017 7:38 AM GMTఏపీ రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరూ రాకపోవటంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై రియాక్ట్ అయిన సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నందమూరి కుటుంబంతో బాబుకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. విభేదాలున్నట్లుగా ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్లుగా కొట్టి పారేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారన్న సోమిరెడ్డి.. "అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు" అని చెప్పారు. మహానాడు విజయవంతం కావటం చూసి జగన్ పార్టీ ఈర్ష చెందుతోందన్న ఆయన.. రాష్ట్రంలో ఏ సమస్యపైన ప్రతిపక్ష పార్టీ అధ్యయనం చేసిందో చెప్పాలన్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మీద ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడ లేని ప్రేమను ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. నిజంగా ఎన్టీఆర్ మీద అంత ప్రేమే ఉంటే.. లక్ష్మిపార్వతిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించాలంటూ జగన్ కు సోమిరెడ్డి సవాలు విసిరారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అంటే తమకు ప్రాణమని.. పార్టీ పుట్టిన నాటి నుంచి పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు వేదిక మీదా.. వేదిక కిందా ఉన్నట్లుగా సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.
మహానాడుకు హాజరు కాని మరో నందమూరి కుటుంబ సభ్యుడైన బాలకృష్ణ గురించి చెబుతూ.. ఆయన సినిమా షూటింగ్‌లో ఉన్నందున రాలేకపోయారని.. ముందుగానే తేదీలు ఖరారు అయినట్లుగా చెప్పారు. సోమిరెడ్డి మాట నిజమే అనుకుందాం. షూటింగ్ డేట్లు ముందుగా ఎలా ఖరారు అవుతాయో.. మహానాడు ఎప్పుడైనా ఒకే తేదీల్లోనే జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు కదా. కీలకమైన పార్టీ మహానాడుకు తగ్గట్లుగా షూటింగ్‌లను ముందేనే డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది కదా? మరి.. ఆ పని బాలయ్య ఎందుకు చేయనట్లు? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మహానాడుకు హాజరు కాని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తాను హాజరు కాకపోవటంపై ఒక లేఖ రాశారు. తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కార్యక్రమానికి రాలేకపోతున్నట్లుగా ఆయన చెప్పారు. అనారోగ్యంతోనే తాను రాలేని విషయాన్ని ఆయన చెప్పారు. ఏమైనా.. మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు రాకపోవటం కొంత లోటేనన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/