Begin typing your search above and press return to search.
పవన్..ఎవరిపైనైనా మనసు పారేసుకుంటారట
By: Tupaki Desk | 16 March 2018 7:22 AM GMTఫ్రెండ్ అన్నప్పుడు చూసీచూడనట్లుగా వ్యవహరించటం మామూలే. కానీ.. లెక్క ఒకసారి తేడా వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చేతల్లో చేసి చూపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తమ తప్పుల్ని కాపు కాచి.. పెదవి విప్పి ఒక్క విమర్శ కూడా చేయని పవన్ పై పల్లెత్తు మాట అనని చాలామంది టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. పవన్ తప్పులపై చిత్రవిచిత్రంగా రియాక్ట్ అవుతున్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై చురకలు అంటేలా వ్యాఖ్యలు చేసే అలవాటు ఉన్న ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా రియాక్ట్ అయ్యారు. పవన్ తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. సినిమాల్లో ఇంటర్వెల్ వరకూ హీరోలా ఉండి.. సెకండ్ ఆఫ్ నుంచి భిన్నమైన రోల్ పోషించినట్లుగా పవన్ వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. పవన్ ఎవరిపైనైనా మనసు పారేసుకుంటాడని.. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత ఆరేసుకుంటాడన్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై మనసు పారేసుకున్నాడని.. ఆ తర్వాత ఆ పార్టీని ఆరేసుకున్నాడంటూ విమర్శించారు. మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పవన్ ఉన్నట్లుండి పన్నీర్ సెల్వంగా ఎందుకు మారిపోయారంటూ తప్పు పట్టారు. నిన్నటి దాకా వామపక్ష భావజాలంతో ఉన్న పవన్.. ఇప్పుడు పక్షపాత భావజాలంలోకి మారిపోయారన్నారు.
ఈ సందర్భంగా మంగళగిరిలోని కాజా గ్రామంలో పవన్ కడుతున్న ఇంటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇంటి నిర్మాణం జరిగిన చోటనే తాను కూడా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నానని.. భూమి గురించి ఎంక్వయిరీ చేస్తే.. ఆరేడు కోట్ల ఖర్చు అవుతుందన్నారన్నారు. కానీ.. పవన్ కు మాత్రం రూ.40లక్షలకే ఇచ్చేశారన్నారు. సినిమా హీరో మీద మోజుతో తక్కువ ధరకే ఇచ్చేశారేమో అంటూ ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి లాంటోళ్లు సీన్లోకి దిగిన వేళ.. పవన్ మరికాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరికి టార్గెట్ గా మారిన పవన్ ఇంటిపై ఆయన క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.