Begin typing your search above and press return to search.
ఆరేడుకోట్ల స్థలాన్ని పవన్ కు రూ.40లక్షలేనా?
By: Tupaki Desk | 16 March 2018 5:17 AM GMTనీతులు చెప్పే వారు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. ఏ మాత్రం తప్పు చేయకూడదు. రూపాయి పోయినా సరే.. విలువలు పాటించాలే కానీ.. కక్కుర్తి అస్సలు పడకూడదు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. పవన్ లాంటోళ్లు అయితే.. ఎంత పక్కాగా ఉండాలి?
నిత్యం నీతులు చెప్పే పవన్.. తాను ఆదర్శాలకు నిలువెత్తు రూపంగా అభివర్ణిస్తుంటారు. తప్పు చేయనని.. ఒకవేళ చేస్తే.. చట్టం తనకు విధించే శిక్ష కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా తనను తాను శిక్షించుకుంటానని చెబుతుంటారు. మరి.. అవి ఎలాంటి శిక్షలో పవన్ ఎప్పుడు రివీల్ చేయలేదనుకోండి.
తాజాగా మంగళగిరి సమీపంలోని కాజా గ్రామంలో పవన్ ఇంటి నిర్మాణం షురూ చేయటం తెలిసిందే. రెండు ఎకరాల స్థలంలో ఇంటిని.. పార్టీ ఆఫీసును నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పిన పవన్.. ఈ మధ్యనే భార్యతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ ముహుర్తంలో ఈ భూమిని కొనుగోలు చేశారో కానీ ఆయనపై విమర్శలు ఓ రేంజ్లో సంధిస్తున్నారు. నీతులు చెప్పే పవన్ కల్యాణ్.. తానుకొన్న రెండు ఎకరాల భూమిని.. రూ.40లక్షలకు కొన్నట్లుగా పత్రాలు బయటకు వచ్చాయి.
కాజా గ్రామంలో భూముల విలువలు చూస్తే.. ఎకరం తక్కువలో తక్కువ అంటే రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు ఉంది. తక్కువగానే లెక్క వేస్తే.. పవన్ కొనుగోలు చేసిన రెండు ఎకరాల భూమి ధర రూ.4కోట్లుఉండాలి. కానీ.. రూ.40 లక్షలకే ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోవటంపై పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. అవినీతి గురించి.. విలువల గురించి లెక్చర్లు ఇచ్చే పవన్.. తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం.. ఆ నీతుల్ని వదిలేసి రూ.40 లక్షలకే ఎలా భూమిని కొనుగోలు చేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. సినీహీరో కావటంతో ఆరేడు కోట్ల రూపాయిల స్థలాన్ని పవన్ కు రూ.40లక్షలకే అమ్మారా? అంటూ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అందరి తప్పుల్ని నిలదీస్తానని చెప్పే పవన్.. ఇప్పుడు అందరూ తనను నిలదీసే అవకాశం ఎందుకు ఇచ్చినట్లు?