Begin typing your search above and press return to search.
నాలుగుసార్లు ఓడినా మంత్రి కావాలంటోన్న నేత
By: Tupaki Desk | 7 Nov 2016 11:30 AM GMTపదవంటే ఎవరికి చేదు చెప్పండి! అసలామాటకొస్తే.. పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ అన్న కన్యాశుల్కం గిరీశం డవిలాగుని మన నేతలు పాలిటిక్స్‌లో పదవి దక్కని వాడు.. పదవి పొందని వాడు. . పదవిలో లేనివాడు దున్నపోతై పుట్టినట్టేనని అన్వయించుకుని - పదవి దక్కకపోడాన్ని - పదవిలో లేకపోవడాన్ని అవమానంగా భావించుకుని కుమిలిపోరూ...! నేతలున్నదెందుకురా? అంటే.. పదవులు పొందేటందుకురా! అని తడుముకోకుండా ఠక్కున ఆన్సరిచ్చే పాలిటిక్స్ పాఠశాలల నుంచి వస్తున్న నేటి తరం నేతలకు పదవులపై ఆ మాత్రం మోహం.. వ్యామోహం.. ఉంటే తప్పేంటంట!! అంతెందుకు, ఎన్నికల్లో ఓడిపోయి కూడా.. దొడ్డిదారిన పదవులు వెలగబెతున్నోళ్లు ఎంతమంది లేరని మన దేశంలో?! అదిసరేగానీ, ఇప్పుడీ సోదంతా ఎందుకంటారా? ఈ ఊకదంపుడు కహానీ ఎనక కథేంటంటారా? మరి చదవండి!!
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి! పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు! టీడీపీ సీనియర్ నేతగా ఏదో ఒక పాయింట్ ను పట్టుకుని నిత్యం మీడియాలో కనిపించే ఈ నేత నెల్లూరు పాలిటిక్స్ లో చాన్నాళ్లుగా చక్రం తిప్పుతున్నారు. గతంలో ఓ సారి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు పుణ్యమాని మంత్రిగా పదవిని అనుభవించారు. అయితే, ఆ తర్వాత ప్రజలు.. ఆయన్ను వరసపెట్టి మరీ ఓడించేస్తున్నారు. దీంతో 2004 - 2009 - 2014 ఎన్నికల్లో ఆయన వరుసగా ఓడిపోయారు. 2012 ఉప ఎన్నికల్లో సైతం ఆయన ఓటమిపాలయ్యారు. అయితే, మనోడికి టీడీపీ పట్ల ఉన్న చిత్తశుద్ధికి, చూపుతున్న భక్తి శుద్ధికి మెచ్చిన చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉంది కదా! అనుకుంటున్నారా? నిజమే! అది మీలాంటోళ్లకి. కానీ.. మన నేతాశ్రీ కాస్త ముదురు లేండి! గతంలో అనుభవించిన పదవి తాలూకు వాసనలు వదిలి పెట్టలేకపోతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడున్న దర్పం మళ్లీ ప్రదర్శించాలని - అందరితోనూ దండాలూ దస్కాలూ పెట్టించుకోవాలని తెగ సంబరపడిపోతున్నాడు. దీంతో చింత చచ్చినా పులుపు చావదన్న టైపులో ముచ్చటగా మూడు సార్లు ప్రజలు ఛీకొట్టినా.. మంత్రి పదవిపై మాత్రం మక్కువ పోవట్టేదు! దీంతో ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటి నుంచి సోమిరెడ్డి తనదైన స్టైల్లో చక్రం తిప్పతున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అధినేత చంద్రబాబు మెప్పు కోసం వైకాపా అధినేత జగన్ పై ఎక్కడికక్కడ అవసరం ఉన్నా లేకున్నా.. టైం పాస్ విమర్శలతో మీడియాలో కనిపించేస్తున్నారు. నెల్లూరు టీడీపీలో తాను ఒక్కడినే వైకాపాను ఎండకడుతున్నానన్న బిల్డప్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసి అధినేత తనకు అమాత్య పదవిని కట్టబెడతారని సోమిరెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మరి చంద్రబాబు ఈ ట్రిక్స్‌కి పడిపోతారా? లేదా? అన్నది కొన్నాళ్లు వెయిట్ చేస్తేనేగానీ చెప్పలేం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/