Begin typing your search above and press return to search.
నెల్లూరు తమ్ముడికి దెబ్బ పడిందట
By: Tupaki Desk | 4 March 2017 8:19 AM GMTరాజకీయాల్లో చాలా చాలా చిన్న విషయాలు సైతం పెద్ద పెద్ద మార్పులకు దారి తీస్తుంటాయి. అందుకే.. నేతలు ఆచితూచి అడుగులు వేయాలని చెబుతుంటారు. మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లుగా సిగ్నల్స్ ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల నేపథ్యంలో.. బుగ్గ కారు ఎవరెవరికి దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో.. కొందరికి మంత్రి పదవులు మిస్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటివన్నీ ఉత్త గాలి మాటలుగా కొందరు కొట్టి పారేస్తున్నా.. తమ మాటలకు తగిన వాదనను వినిపిస్తున్నారు. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో తాను బీకాంలో ఫిజిక్స్ చదివినట్లుగా చెప్పి ఎంత అల్లరి కావాలో అంత అల్లరైన తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చేది లేదన్నమాటను బాబు సన్నిహిత వర్గాలు తమ ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితి మరో తమ్ముడికి ఎదురైనట్లు చెబుతున్నారు.
టీవీ చర్చల్లో ఎక్కువగా.. రోడ్ల మీద తక్కువగా కనిపిస్తారన్న విమర్శను ఎదుర్కొనే నెల్లూరు తెలుగు తమ్ముడు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కటం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు.. బాబు పుణ్యమా అని ఎమ్మెల్సీ పదవి దక్కింది. తన లాంటి సీనియర్ కు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్లా? అన్న విన్నపాల్ని పదే పదే చేసుకున్న నేపథ్యంలో.. మంత్రిపదవిని ఇచ్చే విషయంపై బాబు ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. టీడీపీ వర్గాలు కూడా.. సోమిరెడ్డికి బుగ్గకారు ఛాన్స్ ఉన్నట్లుగా తేల్చారు.
ఊహించని విధంగా తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బుగ్గ కారు ఛాన్స్ మిస్ అయినట్లేనని తెలుస్తోంది. సోమిరెడ్డికి మంత్రి పదవి రాకుండా ఉంటే అది విపక్ష నేత జగనే కారణంగా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఈ మధ్యన జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన సోమిరెడ్డి.. ఆ విషయంలో ఫెయిల్ కావటంపై బాబు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవి ఆశించే వేళ.. పార్టీకి నష్టం వాటిల్లే చర్యలకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన లేకపోతే ఎలా అన్న భావనలో అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రత్యర్థుల్ని ఎత్తుల్ని పసిగట్టటంలో సోమిరెడ్డి ఘోరంగా ఫెయిల్ కావటంతో టీడీపీకి చెందిన పలువురు ఎంపీపీ..ఎంపీటీసీ.. జెడ్పీటీసీలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిపోవటంతో.. ఎమ్మెల్సీ ఎన్నిక పీటముడి పడిన పరిస్థితి. లెక్కలు తేడా కొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ పార్టీ ఓటమి చెందితే అంతకు మించిన అవమానం మరొకటి ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. దీనంతటికి కారణం సోమిరెడ్డి అని.. ఆయన అలక్ష్యమే పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెట్టిందన్న మాట వినిపిస్తోంది.
నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాకాటి నారాయణ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తుంటే.. ఆయనకు ప్రత్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనం కుటుంబానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి బరిలోఉన్నారు. ఈ నేపథ్యంలో పోటీ తీవ్రంగా మారింది. తుది ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా సోమిరెడ్డిదే బాధ్యతగా పార్టీ తేలుస్తుందని చెబుతున్నారు. నిజానికి..ఇప్పుడున్నపరిస్థితికి సోమిరెడ్డి తీరే కారణంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవేళ విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే.. అక్కడ జగన్ పార్టీ బలం పెరగకుండా ఉండేందుకు బ్యాలెన్స్ చేసే అవకాశం ఉందని.. ఇందుకు ఆనం సాయంగా నిలవొచ్చని.. అదే జరిగితే సోమిరెడ్డికి రావాల్సిన బుగ్గకారు ఆనం వారింటికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు తాజా పరిణామాలు సోమిరెడ్డికి ఇబ్బందికరంగా మారాయన్నమాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/