Begin typing your search above and press return to search.
సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి హీరోయిజం
By: Tupaki Desk | 18 Nov 2015 6:52 AM GMTనెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి నాయకుడనిపించుకున్నారు. సకాలంలో స్పందించి ఓ కొత్త జంటను వరదల నుంచి రక్షించి హీరో అయ్యారు. దీంతో ఆధిపత్య పోరుతో ఉడుకుతున్న నెల్లూరు టీడీపీలో సోమిరెడ్డి అనుచరులంతా మా నాయకుడంటే ఏమనుకున్నారు... ప్రజలను కాపాడేవాడే నాయకుడు.. పదవులతో షో చేసేవారు నాయకులు కాదు అంటూ పరోక్షంగా మంత్రి నారాయణను ఉద్దేశించి అంటున్నారు.
గత కొద్ది రోజుల కురుస్తున్న వర్షం కారణంగా నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. వందలాది చెరువులు గట్లు తెగడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ నీట మునిగిపోయాయి. అంతేకాక కోల్ కతా-చెన్నై జాతీయ రహదారి కూడా నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కోతకు గురైంది. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో జిల్లాలోని గూడూరు సమీపంలో ఓ కొత్త జంట వరద నీటిలో చిక్కుకుపోయింది. మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి కొట్టుకుపోయింది. మంగళవారం అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు సోమిరెడ్డి వెళ్లారు. అదే సమయంలో కొత్తగా పెళ్లి చేసుకుని నెల్లూరు నుంచి గూడూరు వెళుతున్న నవ దంపతులు రోడ్డుకు గండి పడిన ప్రదేశంలో చిక్కుకుపోయారు. నీటి మధ్యలో ఉండిపోయి అటుఇటూ వెళ్లలేని పరిస్థితిలో దిక్కుతోచక భయంభయంగా ఉన్నవారిని గమనించిన సోమిరెడ్డి వెంటనే అక్కడికక్కడే ఎన్డీఆర్ బృందాలతో మాట్లాడి బోట్లను తెప్పించారు. సోమిరెడ్ది ఆదేశాలతో బోట్లతో అక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది ఆ నవ దంపతులను కాపాడి, సురక్షితంగా గూడూరుకు చేర్చారు. ఈ సందర్భంగా ఆ కొత్త జంట సోమిరెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్రాణాలు పోతాయనుకున్నామని... అలాంటి సమయంలో తమ ప్రాణాలు కాపాడాలంటూ వారు చెబుతున్నారు.