Begin typing your search above and press return to search.
టీడీపీ నేత సోమిరెడ్డి వింత డిమాండ్
By: Tupaki Desk | 9 July 2016 10:22 AM GMTరాజకీయాల్లో ఉన్నవారు ఎదుటి వారిపై ఎలాంటి విమర్శలైనా - డిమాండ్లైనా చేయొచ్చనేది ఇటీవల తెలుగు దేశం నేతల ప్రసంగాలు వింటుంటే బోధపడుతోంది. ముఖ్యంగా టీడీపీలోని కొందరు నేతలు ప్రధాన విపక్షం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు - డిమాండ్లు ఒకింత చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. కేసులున్నాయి కాబట్టి జగన్ పత్రికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఒకరంటే.. జగన్ పోగేసిన లక్షల కోట్ల రూపాయల ఆస్తులను ప్రజలకు పంచాలని సాక్షాత్తూ మంత్రి పీ నారాయణే సెలవిచ్చారు. మరో సీనియర్ నేత - ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ అయితే, జగన్ చేపట్టిన ఇంటింటికీ యాత్ర నేపథ్యంలో ఆయన ఇంటింటికీ తిరిగి తనపై ఈడీ - సీబీఐలు కేసులు ఎందుకు నమోదు చేశాయో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
అంతేకాదు, ఇదే వరుసలో చేరిపోయిన మాజీ సీఐ - ప్రస్తుత గృహ నిర్మాణ కార్పరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అయితే.. ఇంటింటికీ తిరిగి జగన్ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. అయితే, ఇవన్నీ సాధ్యంకావని ఆయా నేతలకు మాత్రం తెలియందికాదు. ఇక.. ఇప్పుడు లేటెస్ట్ డిమాండ్ ఏంటంటే, ఈ పార్టీకే చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా జగన్ ను ఉద్దేశించి విచిత్రమైన డిమాండ్ చేశారు. ఆస్తుల కేసులో నిందితుడుగా ఉన్నందున విపక్ష నేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రసంగాలపై నిషేధం విధించాలని ప్రసార భారతికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు.
జగన్ ప్రసంగాలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసులలో ఉన్న వ్యక్తికి చట్టసభలలో ఓటు హక్కు లేకుండా చేయాలని కూడా ఆయన అన్నారు. ఎమ్మెల్యే - ఎంపీలు కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అయితే, ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఆయనకే తెలియాలి. ఎందకంటే, రాష్ట్రస్థాయిలో జగన్ ఉంటే జాతీయ స్థాయిలో అనేక మందిపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఎవరూ సోమిరెడ్డి లాంటి డిమాండ్ చేయలేదు. నిజంగానే ఆయన ప్రసార భారతికి ఫిర్యాదు చేస్తే.. ఈ విషయంలో ఆ సంస్థ ఏం చేస్తుందో చూడాలి.