Begin typing your search above and press return to search.
సోమిరెడ్డికి కాకాని సవాల్.. సంబంధం లేదన్న వెబ్ సైట్
By: Tupaki Desk | 5 Jun 2021 4:30 PM GMTఆనందయ్య మందు విషయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దోచుకుంటున్నారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన విమర్శలు రాజకీయ వేడి పుట్టించాయి. తాజాగా ఈ విమర్శలపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దమ్ముంటే రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అని కాకాని సవాల్ చేశారు.
సోమిరెడ్డి ఆరోపణలపై ఆధారాలు ఉంటే నిరూపించాలని.. లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని కాకాని స్పష్టం చేశారు. ‘ఆయుర్వేదం’లో ఆనందయ్యకు ఎంతో అనుభవం ఉందని.. కోవిడ్ నిబంధనలు పాటించలేదని పంపిణీ నిలిపివేశారని తెలిపారు. సోమిరెడ్డి ఈ విషయలో దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆనందయ్య మందు విషయంలో ఎవరైనా ఆర్థికసాయం చేయాలనుకుంటే నేరు ఆయనకే చేయవచ్చని.. ప్రభుత్వానికి, వైసీపీకి ఆనందయ్య మందుతో సంబంధం లేదని తెలిపారు. అన్ని జిల్లాలకు మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఆనందయ్య మందుకు అనుమతుల కోసం ఎంతో కష్టపడ్డామని కాకాని తెలిపారు.
ఇక సోమిరెడ్డి ఆనందయ్య మందు విషయంలో ఓ వెబ్ సైట్ ను వివాదంలోకి లాగారు. ఆ వెబ్ సైట్ లో ఆనందయ్య మందుకు ధరలు పెంచి దోచుకుంటున్నారని సోమిరెడ్డి విమర్శించారు. దీనిపై తాజాగా ఆ వెబ్ సైట్ కు చెందిన శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదారెడ్డి, సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తమ వెబ్ సైట్ గురించి సోమిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు.
మా వెబ్ సైట్ వెనుక ఎలాంటి దోపిడీ లేదని.. అంతా పారదర్శకం అన్నారు. టెస్టింగ్ చేసే క్రమంలోనే వెబ్ సైట్ లో రేట్లు పెట్టుకున్నామని.. అవి ఫైనల్ కాదని అన్నారు. ఈ అంశాన్ని సోమిరెడ్డి ఇలా రాజకీయం చేయడం దుర్మార్గం అని వెబ్ సైట్ ఎండీ నర్మదారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కాకానికి, మా వెబ్ సైట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.