Begin typing your search above and press return to search.
సోము సార్.. జగన్‌ను కడిగేయండి.. అదే చేత్తో.. మోడీని కూడా!
By: Tupaki Desk | 1 April 2022 12:30 AM GMTఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు పెద్ద సంకటమే వచ్చి పడింది. ఆయన ఏపీ సర్కారుపై తీవ్రస్తాయిలో విరుచుకుపడాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ఆయనకు విద్యుత్ చార్జీల పెంపు అనూహ్యం గా కలిసి వచ్చింది. ఇంకేముంది.. జగన్ సర్కారుకు వార్నింగులు ఇచ్చారు. ఓకే ఇది మంచిదే. ప్రజల తరఫున ప్రతిపక్షంగా.. ఆయన అలా నోరు చేసుకోవడం.. చాలా చాలా ఆహ్వానించాల్సిందే.. కానీ.. ఏపీ ప్రజలు పిచ్చోళ్లా... లేక.. తమకు ఏమీ తెలియదని అనుకుంటున్నారా? అందుకే సోము వీర్రాజుకు అదిరిపోయే ప్రశ్న సంధిస్తున్నారు.
ఇంతకీ సోము వారి ఫైర్ ఇదే!
ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ విద్యుత్ చార్జీల బాదుడును వెంటనే వాపస్ తీసుకోవాలని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారని.. అన్నారు.
31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు, అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచారని అన్నారు. అయితే.. 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారని, అదేవిధంగా 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు రూ.0.55 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని. ఇవన్నీ వెంటనే ఉపసంహరించుకోవాలని సోము డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల ను ఉపసంహరణ చేసేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు.
నెటిజన్ల టాక్ ఏంటంటే...
``సొము సార్.. జగన్ సర్కారును ఉతికి ఆరేయండి. మా సపోర్టు ఫుల్లుగా ఉంటుంది. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్న జగన్‌ను అస్సలు వదిలి పెట్టొద్దు. అయితే.. సోము సార్. అదేసమయంలో మోడీని కూడా వదిలిపెట్టేద్దే!`` అంటున్నారు నెటిజన్లు. దీనికి కారణం.. గ్యాస్ బండల ధరలను ఒకేసారి రాత్రికి రాత్రి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత.. రూ.50 చొప్పున పెంచేశారు.
దీనిపై మోడీని నిలదీయాలని.. సోముకు విన్నవిస్తున్నారు. అదేసమయంలో గత 10 రోజులుగా. రోజూ బాదేస్తున్న పెట్రోలు, డీజిల్ చార్జీలను కూడా వెనక్కి తీసుకునేలా ఉద్యమం చేయాలని.. కోరుతున్నారు. మరి.. ఈ నెటిజన్ల డిమాండ్లపై సోము ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.