Begin typing your search above and press return to search.

మోడీ టూర్ : విజయసాయిని టార్గెట్ చేసిన వీర్రాజు

By:  Tupaki Desk   |   3 Nov 2022 4:30 PM GMT
మోడీ టూర్ : విజయసాయిని టార్గెట్ చేసిన వీర్రాజు
X
రాక రాక ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు. పైగా ఆయన రెండు రోజుల పాటు విశాఖలో ఉంటారు. అంతే కాదు, దాదాపుగా పది వేల కోట్ల రూపాయల విలువ చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దాంతో విశాఖ సహా ఉత్తరాంధ్రా వాసుల చిరకాల కోరిక అయిన రైల్వే జోన్ కి శంకుస్థాపన చేస్తారు. ఇలా విశాఖ చుట్టూ జరిగే అభివృద్ధికి ప్రధాని పచ్చ జెండా ఊపుతూంటే మొత్తం ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ భారీ స్కెచ్ ముందే గీసేసింది.

విశాఖలో ప్రధాని టూర్ ని సక్సెస్ చేయడానికి అంటూ ముందుగా తమ ఎంపీ విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపేసింది. విజయసాయిరెడ్డి విశాఖ వచ్చి ప్రధాని సభను ఏర్పాటు చేసే ఏయూ ప్రాంగణాన్ని చూసి అధికారులకు సూచనలు చేశారు. మీడియాకు ప్రధాని టూర్ గురించి మొత్తం విషయాలను వెల్లడించారు. ఇలా వైసీపీ తన హవా చాటుకుంటున్న వేళ బీజేపీకి మండిపోతోంది. బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతూంటే మధ్యలో వైసీపీ హడావుడి ఏంటి అని బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు.

ఒక వైపు విజయసాయిరెడ్డి అంతా తానై వ్యవహరిస్తూ దీన్ని ఎవరూ రాజకీయం చేయవద్దు అంటూ ఇండైరెక్ట్ గా బీజేపీకి చురకలు అంటించారు. దాంతో కమలనాధులు ఊరుకుంటారా. అందుకే ఏకంగా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజే ఫీల్డ్ లోకి దిగిపోయారు. ప్రధాని మోడీ టూర్ అఫీషియల్. దాన్ని చెప్పడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కానీ విశాఖ జిల్లా కలెక్టర్ కానీ మీడియా ముందుకు రావాలి కానీ ఏ హోదాలో విజయసాయిరెడ్డి వస్తున్నారు అని తగులుకుంటున్నారు.

అంతే కాదు విజయసాయిరెడ్డి మొత్తం ప్రధాని ప్రోగ్రాం విషయంలో ప్రజలను పూర్తిగా అయోమయానికి గురి చేస్తున్నారు అని సోమొ వీర్రాజు ద్వజమెత్తారు. ప్రధాని టూర్ విషయంలో విజయసాయిరెడ్డి ప్రజలను తీకమమ పెట్టేలా వ్యవహరిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు అధికారికంగా జరగాల్సిన ప్రధాని టూర్ విషయంలో అంతా తానై వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి తీరు మీద ఆయన ఫైర్ అవుతున్నారు. నిజానికి ప్రధాని టూర్ పూర్తిగా అఫీషియల్. ఆయన టూర్ ప్రోగ్రాం మొత్తం ఒక ప్రభుత్వం చేయాలి. అక్కడ రాజకీయాలు పనికిరాదు.

అయితే వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని వారం ముందుగానే విశాఖలో దించి ప్రధాని ప్రొగ్రాం మొత్తం తామే చేస్తున్నట్లుగా హైలెట్ చేసుకోవడం పట్ల బీజేపీ ఫైర్ అవుతోంది.

ఇక సభకు లక్ష నుంచి రెండు లక్షల మంది జనాలను తీసుకురావడం ద్వారా మోడీని ఖుషీ చేయడానికి చూస్తోంది. అలా మొత్తం తమకు పొలిటికల్ మైలేజ్ దక్కేలా వైసీపీ వేస్తున్న ఎత్తులు, వ్యూహాలతో కమలనాధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వారం రోజుల వ్యవధిలో ప్రధాని టూర్ ఉన్నందువల్ల బీజేపీ నాయకులు ఈ మొత్తం టూర్ లో తాము ఎలా హైలెట్ కావాలో పధక రచన చేస్తున్నారు అని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.