Begin typing your search above and press return to search.
బీసీ సీఎం వ్యాఖ్యలపై సోము వీర్రాజు యూటర్న్!!
By: Tupaki Desk | 5 Feb 2021 2:30 PM GMTఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్కరోజుకే మాట మార్చేశారు. ఏపీలో అధికారంలోకే వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన 24 గంటల్లోపే ఆయన యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది.
తాను ఆ మాట అనలేదని.. కొందరు తన మాటలను వక్రీకరించి అలా ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు.
నిన్న పల్నాడులో బీజేపీలోకి కొందరు చేరికల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సోము వీర్రాజు రాష్ట్రంలో బీసీని సీఎం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. దమ్ముంటే అధికార వైసీపీ, టీడీపీ అలా చేయాలని సవాల్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం.. దీన్ని బట్టి పవన్ ఇక సీఎం కాలేడని.. సోము వీర్రాజు ఆయనకు ట్విస్ట్ ఇచ్చాడని దుమారం చెలరేగింది. దీంతో ఈరోజు సోము వీర్రాజు మరోసారి ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు.
సీఎం అభ్యర్థిని తాము ప్రకటించమని.. కేంద్ర పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్షం జనసేన నిర్ణయం కూడా అందులో ఉంటుందని ప్రకటించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తారని సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. దీన్ని సీఎం కుర్చీ విషయంలో ఇక తన ప్రమేయం ఏమీలేదని.. పవన్ కళ్యాణ్, కేంద్రానిదే బాధ్యత అంటూ సోము వీర్రాజు అస్త్ర సన్యాసం చేసినట్టు అర్థమవుతోంది.
అయితే దీనివెనుక జనసేన ఒత్తిడి పనిచేసిందా? లేక బీజేపీ అధిష్టానం ఆదేశించిందా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే సడెన్ గా సోము వీర్రాజు మాట మార్చడం బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.