Begin typing your search above and press return to search.
అంతా మాయ అంటున్న బీజేపీ పెద్ద...?
By: Tupaki Desk | 26 Dec 2021 8:30 AM GMTఅదేదో పాత సినిమాలో చిరంజీవి పాడే పాట ఒకటి ఉంది. మాయ మాయ అంతా మాయ, సర్వం మాయ అని. ఇపుడు ఆ పాటను అచ్చంగా వల్లె వేస్తున్నారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు. ఆయన లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చి మొత్తం మాయ అనేశారు. ఇంతకీ ఈ మాయ జగమే మాయ కాదుట, ఒక్క ఏపీకి మాత్రమే కమ్ముకున్న మాయట. అలా మాయ చేస్తున్న వారు ఏపీలో ఇద్దరే అంటున్నారు ఆయన. ఆ మాయలోకి జనాలను లాగి బురిడీ కొట్టిస్తున్నారు కూడా వారే అని విరుచుకుపడ్డారు.
ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు మాజీ సీఎం చంద్రబాబు అయితే మరొకరు ప్రస్తుత సీఎం జగన్. ఈ ఇద్దరూ ఏపీ జనాలను మాయ చేసి నిండా ముంచారని సోము గట్టిగానే టార్గెట్ చేశారు. నాడు చంద్రబాబు గ్రాఫిక్స్ తో మాయ చేశారని, ఇపుడు జగన్ అవేమీ అవసరం లేకుండానే ఏకంగా తన మాటలతో మాయ చేసి మభ్యపెడుతున్నారని అందుకే ఇద్దరూ ఇద్దరే అని సోము తేల్చేశారు. ఈ ఇద్దరి వల్ల ఏపీకి జరిగిందీ ఒరిగిందీ కూడా ఏమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఏపీ ఈ రోజు ఇలా దుస్థితిలో ఉండడానికి ఈ ఇద్దరు నాయకుల పోకడలే కారణమని సోము దుయ్యబెడుతున్నారు. ఏపీని బాగు చేయాలీ అంటే ఈ ఇద్దరినీ పక్కన పెట్టాల్సిందే అని కూడా ఆయన జనాలకు పిలుపు ఇస్తున్నారు. గత సీఎం ని జనాలు ఓడించారని, జగన్ మాయలకు కూడా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన జోస్యం చెబుతున్నారు.
ఒక వైపు ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తే దాన్ని డైవర్ట్ చేసే హక్కు ఏపీ సర్కార్ కి ఎవరిచ్చారు అని సోము గద్దిస్తున్నారు. కేంద్రం నిధులు ఇస్తోంది. ఏపీలో అమలవుతున్నఅనేక పధకాలు అన్నీ కూడా కేంద్రానివే. అయితే వాటి మీద తమ స్టిక్కర్లు వేసుకుంటూ నాడు బాబు, నేడు జగన్ స్టిక్కర్ల ముఖ్యమంత్రులుగా మారిపోయారని వీర్రాజు వీర లెవెల్ లో సౌండ్ చేసి
విశిష్ట సత్యం చెప్పేశారు.
అంతేనా.. అమరావతి రాజధాని రైతులను రోడ్డు పాలు చేసిన పాపం అచ్చంగా చంద్రబాబుదే అని ఆయన అంటున్నారు. బాబు నాడు గ్రాఫిక్స్ లతో మాయ చేయకుండా సవ్యంగా రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే ఈ రోజు అమరావతి రైతులు రోడ్డు ఎక్కే సీన్ రానే రాదని ఆయన అంటున్నారు. ఇక జగన్ కూడా ఏపీలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం రెండున్నరేళ్ల పాలనలో చేయలేకపోయారని నిందించారు.
ఈ రోజుకు అయినా బాబు కానీ జగన్ కానీ గుండె మీద చేయి వేసుకుని ఫలానా పని ఏపీ అభివృద్ధి కోసం చేశామని గట్టిగా చెప్పగలరా అని ఆయన నిలదీస్తున్నారు. ఈ ఇద్దరిని చూసి జనం విసిగిపోయారని, ఓడిస్తారని సోము అంటున్నారు. ఇవన్నీ సరే కానీ ఏపీలో ఉన్నవే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు. మరి ఈ ఇద్దరూ కాకుండా రేపటి రోజున బీజేపీకి జనాలు ఓటేస్తారని సోము చెప్పదలచుకున్నారా. అసలు అది జనాలు నమ్మెలా ఉందా. మొత్తానికి మాయ మాయ అంతా మాయ అంటున్న సోము ఏపీకి ఇచ్చిన విభజన హామీల విషయంలో బీజేపీ చేసిందేంటో అది కూడా విడమరచి చెబితే బాగుంటుంది అని సెటైర్లు పడుతున్నాయి.