Begin typing your search above and press return to search.
విశాఖ మీద సోము... టోటల్ చేంజ్ .. ?
By: Tupaki Desk | 1 Jan 2022 1:30 AM GMTఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఒక్కసారి స్పీడ్ పెంచేశారు. విజయవాడ నడిబొడ్డున జరిగిన బీజేపీ ప్రజాగ్రహ సభతో మొదలెట్టి సోము ఒక రేంజిలో సౌండ్ చేస్తున్నారు. ఆ సభలో చీప్ లిక్కర్ ని యాభై రూపాయలకు ఇస్తామని చెప్పి నేషనల్ వైడ్ గా ఫ్యామస్ అయిన సోము ఇక అది కాస్తా బూమరాంగ్ అయిందని నాలిక్కరచుకున్నారో, లేక దాన్ని మించిన అంశంతో అలజడి చేస్తే అది మరుగున పడుతుంది అని భావిస్తున్నారో తెలియదు కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర పదులు అయిన తరువాత కొత్తగా కొన్ని సంస్థల పేర్లు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
జనాలకు బాగా అలవాటు అయిన ఆ పేర్లను అర్జంటుగా మార్చేసి కొత్త పేర్లు పెట్టమంటున్నారు. అవి పరాయి పాలకుల పేర్లుట. దేశ ద్రోహుల పేర్లుట. గుంటూరులో జిన్నా టవర్స్ పేరుని మార్చాలంటూ ఇప్పటికే ఏపీ సర్కార్ కి అల్టిమేటం జారీ చేసిన సోము ఇపుడు విశాఖ మీద కూడా చూపు సారించారు.
విశాఖలో కేజీహెచ్ ఉంది. అది వందేళ్ళ చరిత్ర కలిగినది. దాన్ని బ్రిటిష్ వారు నిర్మించారు. కింగ్ జార్జి పేరు మీద దాని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రాకే అతి పెద్ద ఆసుపత్రి అది, గట్టిగా చెప్పాలీ అంటే ఒడిషా చత్తీస్ గడ్ వాసులకు కూడా అదే ఆరోగ్య వరప్రదాయిని. అలాంటి ఆసుపత్రి పేరుని అర్జంటుగా మార్చకపోతే ఊరుకునేది లేదు అంటూ గర్జిస్తున్నారు సోము. అంతేనా కింగ్ ఎవరు, జార్జి ఎవరు అని ఆయన కామెంట్స్ చేస్తున్నారు. దానికి తెన్నేటి విశ్వనాధం పేరు కానీ గౌతు లచ్చన పేరు కానీ పెట్టమని సూచిస్తున్నారు. నిజమే ఆ ఇద్దరూ ఉత్తరాంధ్రా వాసులు, స్వాతంత్ర సమరయోధులు. అయినా కింగ్ జార్జి ఏం చేశారో మరి అన్నదే మేధావుల మాటగా ఉంది.
ఇక ఒక్క కింగ్ జార్జినే సోము వీర్రాజు చూశారని, విశాఖలో మరో ఆసుపత్రి విక్టోరియా రాణి పేరు మీద ఉందని దాని సంగతేంటి అని కూడా జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇక విశాఖ అభివృద్ధిలో నూటికి ఎనభై శాతం బ్రిటిష్ వారి హయాంలోనే జరిగింది అన్న సంగతి సోముకు తెలియదా అని కూడా అడుగుతున్న వారూ ఉన్నారు. విశాఖను ఫస్ట్ టైమ్ జిల్లాగా చేసినది బ్రిటిష్ వారే. అలాగే పోర్టు, ఏయూ, రైల్వేస్ సహా ఎన్నింటినో నాడు బ్రిటిష్ వారే విశాఖలో ఏర్పాటు చేశారు.
మంచి చేసిన వారిని గుర్తు చేసుకోవడం మంచి విధానం కాకుండా ఎలా పోతుంది అన్నదే విశాఖ వాసుల ప్రశ్నగా ఉంది. ఈ రచ్చ బదులుగా విశాఖకు గట్టి మేలు చేసి సరైన ప్రాజెక్టు కట్టి బీజేపీ నేతల పేర్లే వాటికి పెట్టుకోవచ్చు కదా అన్న సూచనలు వస్తున్నాయి. మొత్తానికి ఒక్క సోము వీర్రాజు దూకుడు చూస్తూంటే ఏపీలో టోటల్ గా అన్నింటినీ చేంజి చేయాల్సిందేగా అంటున్నారు మేధవి వర్గాలు.