Begin typing your search above and press return to search.
సోముకు సెగ తప్పదా.. వరుస డిపాజిట్లు గల్లంతు!
By: Tupaki Desk | 26 Jun 2022 9:34 AM GMTఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజకీయం.. ఇక, ముగింపు దశకు చేరుకుందా? ఆయనను ఆ పదవి నుం చి దింపేయడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకంటే.. పార్టీని అంతో ఇంతో అభివృద్ధి చేస్తానని.. అడిగి మరీ పగ్గాలు చేపట్టిన.. సోము వీర్రాజు.. ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క అడుగులో నూ.. విజయం సాధించకపోగా.. ప్రతి సారీ పరాజయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఒంటె త్తు పోకడలు.. నిర్ణయాలతో పార్టీని దిగజార్చుతున్నారనే చర్చ కీలక నేతల మధ్య ప్రధానంగా వినిపిస్తోం ది.
రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు కేవలం 1-3 శాతమే. అంటే.. దీనిని బట్టి పార్టీని ఎలా డెవలప్ చే యాలనేది అత్యంత కీలకం. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సంఖ్యను పెంచుకోవాలి. అదేసమయంలో పార్టీని నడిపించాలి. ప్రతి ఒక్కరికీ పార్టీని చేరువ చేయాలి. పార్టీపై ఉన్న అపవాదులను తొలగించాలి. ప్రజలకు నమ్మకం కలిగించాలి. మరీ ముఖ్యంగా పార్టీలో నేతల మధ్య సఖ్యత పెంచాలి. కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేలా.. కొన్ని పరిస్థితులను కల్పించాలి. కాన, ఇవన్నీ.. వదిలేసిన.. సోము.. ఎన్నికల్లో పోటీకి మాత్రం సై అన్నారు.
2019 సార్వత్రిక సమరం తర్వాత.. ఏపీలో ఇప్పటి వరకు మూడు ప్రదాన ఎన్నికలు జరిగాయి. ఒకటి తిరు పతి పార్లమెంటు కాగా.. రెండు కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక, మూడు.. తాజాగా జరిగిన నెల్లూరులోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఈ మూడు చోట్లా కూడా అభ్యర్థులు చనిపోయి న కారణంగానే ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేసే పార్టీలు ఆచితూచి అడుగులు వే యాల్సి ఉంది. అందుకే.. ఒక్క తిరుపతి మినహా.. మిగిలిన రెండు చోట్లా టీడీపీ తప్పుకొంది.
కానీ, బీజేపీ మాత్రం సోము వారి ఆధ్వర్యంలో.. మూడు చోట్లా పోటీ చేసింది. తిరుపతిలో అయితే.. మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభను తీసుకువచ్చి బరిలో నిలిపారు. ఇక, బద్వేల్, ఆత్మకూరులోనూ ఇదే జరిగింది. మరి సాధించింది ఏంటి? అంటే.. కనీసం డిపాజిట్ సొమ్మును కూడా రాబట్టుకోలేక పోవడమే. దీనిని బట్టి సోము వీర్రాజు సాధించింది ఏంటి? ఆయన వల్ల బీజేపీకి ఒరిగింది ఏంటి? ఉట్టికే ఎగరేలన్న మాదిరిగా ఆయన రాజకీయాలు ఉన్నాయనే విమర్శలు తప్ప. అందుకే ఆయనను మారిస్తే.. తప్ప వచ్చే ఎన్నికల్లో పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.