Begin typing your search above and press return to search.
దమ్ముంటే..ఎమ్మెల్యేలను కాల్చిపారేయాలి!
By: Tupaki Desk | 21 Jan 2017 11:38 AM GMTసుదీర్ఘకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లధనాన్ని అరికట్టే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన వీర్రాజు ఈ విషయంలో విమర్శలు సరికాదని అన్నారు. ఈ సందర్భంగా అడవిలో ఉండే మావోయిస్టుల గురించి ప్రస్తావిస్తూ పేదవాళ్లను చంపేయడానికేనా నక్సల్స్ ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు . మావోయిస్టులకు దమ్ముంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి.. ఓ నలుగురైదుగురు అవినీతి ఎమ్మెల్యేలను కాల్చిపారేయాలి అంటూ వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ భద్రత పెంచాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన రోజే వీర్రాజు ఈ వ్యాఖ్యాలు చేయడం గమనార్హం.
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వీర్రాజు సమాజంలోని అవినీతిని, అన్యాయాలను అరికట్టేందుకు తామున్నామని చెప్తున్న మావోలు అడవిలో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. "అవినీతి అడవుల్లోనే ఉందా? - పేదవాళ్లను చంపేయడానికేనా నక్సల్స్ ఉంది? నక్సలైట్లకు దమ్ముంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి.. ఓ నలుగురైదుగురు అవినీతి ఎమ్మెల్యేలను కాల్చిపారేయాలి. అసలు నక్సలైట్ల దగ్గరరే నల్లధనం ఉంది. కొందరు నక్సల్స్ బెదిరింపులకు పాల్పడిన డబ్బులను అడవుల్లో డంపుల రూపంలో దాచుకుంటున్నారు" అంటూ వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉండగా ఇవాళ కేంద్ర హోం శాఖా మావోయిస్టుల కదలికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అదనంగా మరో ఎన్ ఎస్ జీ బృందాన్ని హోంశాఖ చంద్రబాబుకు కేటాయించింది. సీఎం సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించింది. బాబుతో సహా టీడీపీ నేతల భద్రత కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/