Begin typing your search above and press return to search.
బాబు ద్రోహం ఓకే.. తమరేం చేశారని...
By: Tupaki Desk | 12 March 2018 11:54 AM GMTబాబును భాజపా విమర్శించడంలో కొత్త లేదు. కానీ.. ఉత్తరాంధ్ర - సీమలను బాబు విస్మరించారిన అంటున్న సోము వీర్రాజు ఆ ప్రాంతాలకోసం తమ కేంద్రం ఏం చేసిందో చెప్పడం లేదు. ఆ వెనుకబడిన ప్రాంతాల మీద వారికి నిజంగానే అంత ప్రేమ ఉంటే.. కేంద్రంనుంచే నిధులు ఇప్పించవచ్చు కదా.. అనే వాదన కు వారివద్ద జవాబు లేదు. బాబు ద్రోహం ప్రజలకు తెలుసు.. మీరు కొత్తగా దాన్ని కనిపెట్టి చెప్పనవసరం లేదు. ముందు మీ సంగతి తేల్చండి.. మీరు చేసిన న్యాయమేంటో చెప్పండి అని ప్రజలు అడుగుతున్నారు.
టీడీపీ అధినేత - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించడానికి ఒంటికాలిపై లేచే బీజేపీ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు తాజాగా మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదని - అంతా అమరావతిలో కుప్పపోసినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ కు చేటు తెస్తుందన్నారు. రాజకీయ నాయకుల విమర్శలు - ప్రతివిమర్శల్లో తరచూ వినిపించే మాటలు తూటాలు ''ద్రోహం - మోసం - అన్యాయం - కుట్ర, కుతంత్రం..'' వగైరాలలో ఎక్కువగానే మన వీర్రాజు గారు వాడేశారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు కూడా బాబుపై విమర్శలకు వెరవని ఆయన - పొత్తు వీడాక మరింత రెచ్చిపోతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర - రాయలసీమ జిల్లాలకు ప్రతి ఏటా ఇవ్వాల్సిన రూ.350కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం ఎందుకో సెలవిస్తే బాగుండేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
గడచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం అన్నట్లు వ్యవహరిస్తున్న తీరును - ఆయన తీసుకుంటున్న చర్యలపై వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఇప్పటికే బాగా అర్థమైంది. వారైతే సమయం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజధాని అమరావతి కేంద్రంగా నిర్ణయించిన చంద్రబాబు సీమలో హైకోర్టు ఏర్పాటుపై పెదవి విప్పలేదు ఇదేమంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ లీకులు మొదలయ్యాయి. దేశంలో నేనే సీనియర్ అని పదే పదే చెబుతున్న చంద్రబాబు ఇంతకు మునుపు తొమ్మిదేళ్ల పాలన అంతా అగ్యమ్యగోచరంగా సాగింది. ఆర్థిక సంస్కరణలు అంటూ ప్రపంచబ్యాంకు చుట్టూ తిరిగి సంక్షేమాన్ని విస్మరించారు. తొమ్మిదేళ్లూ ప్రకృతి కూడా సహకరించని విషయం తెలిసిందే. తాజాగా కేంద్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని జనం నమ్మారు. కానీ చివరకు ఏమైంది? ఇటు బీజేపీ - అటు టీడీపీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో చేతులెత్తేశారు. ఇప్పటి వరకూ ప్యాకేజీకి ఓకే అన్న చంద్రబాబు - హోదా అంశంపై జగన్ బాబు స్పీడు చూసి మళ్లీ హోదా పల్లవిని అందుకున్నారు. కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించిన తెలుగుదేశం అధినేత ఇంకా ఎన్డీయేలోనే ఉన్నామని - దీనికి మరింత సమయం ఉందన్నట్లు మాట్లాడుతున్నారు.
కానీ మన సోము వీర్రాజు మాత్రం ప్రభుత్వం నుంచి బయటకు వస్తే చాలదు - ఎన్టీయే నుంచి ఎప్పుడు బయటకు వస్తారన్నట్లుగా..ఆయన విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని విమర్శలు చేస్తున్న సోము వీర్రాజు... పట్ల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.350 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని పొత్తు వున్నప్పుడు రాష్ట్రానికి ఎందుకు సూచించలేదు. హోదా వస్తే అభివృద్ధి చెందేది వెనుకబడిన ప్రాంతాలే కదా? అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా హోదా ఎందుకు ఇవ్వలేదు? అనే ప్రశ్నలు జనం నుంచి బలంగానే వినిపిస్తున్నాయి.
చంద్రబాబే విభజనకు లేఖలు ఇచ్చారని - సమన్యాయం కోరారే తప్ప.. ఏపీ కి న్యాయం అప్పుడూ కోరలేదని.. ఎన్నికల్లో 1200 హామీలు ఇచ్చి అధికారం దక్కించుకుని ఒక్కటీ నెరవేర్చలేదని అంటున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాటేమో గానీ, అటు కేంద్రంలో - ఇటు రాష్ట్రంలో ప్రధామంత్రి - ముఖ్యమంత్రి హోదాల కోసం ఎత్తులు - జిత్తులతో - వ్యూహాలు - ప్రతి వ్యూహాలతో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయనే సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా అర్థమవుతోంది.