Begin typing your search above and press return to search.
బాబూ...మైండ్ గేమ్స్ మాకూ తెలుసు
By: Tupaki Desk | 20 Dec 2017 4:51 PM GMTఇటీవల కాలంలో రాజకీయాల్లో మైండ్ గేమ్స్ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఫిరాయింపుల వ్యవహారాల్లో ఈ మైండ్ గేమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ పాలక పార్టీలు ఇప్పటికే చాలా మైండ్ గేమ్స్ ఆడేసి అందులో చాంపియన్లయి పోయాయి కూడా. అయితే... మైండ్ గేముల్లో ఆరితేరిపోయిన టీడీపీకి ఇప్పుడు బీజేపీ నుంచి అలాంటి అనుభవమే ఎదురవుతోంది ఇప్పుడు. గుజరాత్ ఎన్నికలు తెచ్చిన ధీమాతో ఏపీ బీజేపీ నేతలు తమ మిత్రపక్షం టీడీపీతో మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మొదలుపెట్టిన ఈ మైండ్ గేమ్ ను... చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే మరో నేత పురంధేశ్వరి కొనసాగిస్తారని.. చివరకు తమకు కావాల్సినన్ని సీట్లను డిమాండ్ చేసేలా ఈ ఆట ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
చాలాకాలంగా టీడీపీ నేతలను బీజేపీ నేతలు.. బీజేపీ నేతలను టీడీపీ నేతలు విమర్శించుకోవడం లేదు. కానీ.. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఇలా గెలిచిందో లేదో ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు అలా రెచ్చిపోయారు. చంద్రబాబుపై - టీడీపీపై ఓపెన్ కామెంట్లు చేశారు. తాము నోట్లు రద్దు చేసి ఎన్నికల్లో గెలిస్తే వాళ్లు నోట్లు పంచి గెలిచారంటూ నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తీరును పరోక్షంగా గుర్తు చేశారు. అయితే.. సోము వీర్రాజు కానీ - ఇతర బీజేపీ నేతలు కానీ ఏం ఆరోపణలు చేసినా కూడా స్పందించవద్దని చంద్రబాబే ఆదేశించడంతో టీడీపీ నేతలు కామ్ గా ఉన్నారు. ఇదే సమయంలో ఇతర బీజేపీ నేతలు కూడా టీడీపీపై విమర్శలు - ఆరోపణలతో ఒత్తిడి పెంచడానికి రెడీ అవుతున్నట్లు భావిస్తున్నారు.
నెక్స్ట్స్ స్పెల్ లో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి రంగంలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నేతలు కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు పై రివర్స్ కౌంటర్లేసినట్లుగా పురంధేశ్వరిపై చాలామంది టీడీపీ నేతలు విమర్శలు చేయలేరని గతంలోనూ తేలిపోయింది. ఈ నేపథ్యంలో నిజంగానే పురంధేశ్వరి రంగంలోకి దిగి టీడీపీపై దాడి మొదలుపెడితే ఏం చేయాలనే విషయంలో టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. పైగా చంద్రబాబు రాష్ఱ్టంలో లేని సమయంలో ఇలా బీజేపీ నేతలు దండయాత్ర చేస్తే ఏం చేయాలో తోచడం లేదట.
కాగా.. బీజేపీ నేతలు ఇంతగా టీడీపీపై విమర్శలకు దిగడానికి కారణం వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగడం కోసమేనని తెలుస్తోంది. మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబును ఇరుకున పెట్టి ఎక్కువ సీట్లు డిమాండు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న విశాఖ - నర్సాపురంతో పాటు విజయవాడ - కాకినాడ - నెల్లూరు ఎంపీ సీట్లు కూడా బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ విజయానికి అవకాశం ఉన్న స్థానాల జాబితాను ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు అమిత్ షాకు పంపించారట.