Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు సోము వీర్రాజు కౌంటర్
By: Tupaki Desk | 31 Dec 2021 10:34 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో సోము వీర్రాజు తాము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. వైసీపీ నేతలు ఈ వ్యవహారంలో సోము వీర్రాజును టార్గెట్ చేస్తూ ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా అనర్హుడని.. ఆయన సారాయి వీర్రాజు అని విమర్శలు గుప్పిస్తున్నారు. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి ఏపీ బీజేపీ దిగజారి పోయిందని విమర్శిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ సైతం సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై బీజేపీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోమారు తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సోము వీర్రాజు తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని లెక్కలు చెప్పారు.
రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సోము వీర్రాజు 50 రూపాయలకు చీప్ లిక్కర్ అమ్మితే ప్రతీ పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయని లెక్కలు చెప్పారు.
తాను లిక్కర్ గురించి పేదవాడిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడానని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు. రూ.6 బాటిల్ ను రూ.200 అమ్మితే తాను ప్రోత్సహించలేనని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు.. తనను సారాయి వీర్రాజు అన్న వారు ఏం తాగుతారో తనకు తెలుసు అంటూ సోము వీర్రాజు తనపై వ్యాఖ్యలు చేసిన వారిపై సెటైర్లు వేశారు.
సారాయి వీర్రాజు కాదని.. బియ్యం వీర్రాజు అని.. సిమెంట్ వీర్రాజు నని.. కోడిగుడ్ల వీర్రాజు నని ఆయన చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు ఏదో అషామాషీగా చేసిన వ్యాఖ్యలు కాదని.. 2024 మేనిఫెస్టోలోనూ తన వ్యాఖ్యలను పెడుతానని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
తనపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజామున 3 గంటల వరకూ ఏం చేస్తారో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో మద్యం పేరుతో నిలువుదోపిడీ జరుగుతోందని.. ఈ క్రమంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్నారు.