Begin typing your search above and press return to search.
హన్నన్నా.. సోమన్నా.. ఉప ఎన్నికకు.. సార్వత్రిక ఎన్నికకు తేడా లేదా?
By: Tupaki Desk | 17 Jun 2022 4:30 PM GMTఉప ఎన్నికకు... సార్వత్రికకు ఎన్నికకు తేడా ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలో అయితే.. ప్రచారం ఒక విధంగాను.. ఉప ఎన్నికలో అయితే.. మరో విధంగా నాయకులు ప్రచారం చేస్తారు. ఉప ఎన్నిక అనేసరికి.. సింపతీ రాజకీయాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ మేరకు ప్రచారం చేయాలి. కానీ, ఘనత వహించిన బీజేపీ ఏపీ చీఫ్.. సోము వీర్రాజు మాత్రం.. నెల్లూరులోని ఆత్మకూరు ఉప ఎన్నికలో సార్వత్రిక సమరం తలపించేలా.. ప్రచారం చేస్తున్నారని.. బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీవైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. జిల్లా ఇంచార్జ్‌లు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక, ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తరఫున సోము వీర్రాజు ప్రచారం దంచికొడుతున్నారు.
గ్రామాల్లో పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లింపు చేయడం లేదన్నారు.
రైతులకు మద్దతు ధర అందడం లేదన్నారు. రైతును దగా చేస్తున్న ప్రభుత్వం అంటూ.. వైసీపీ సర్కారుపై విమర్శలు చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. నాశిరకం విత్తనాలు ఇస్తున్నారన్నారు. రైతుభరోసా కేంద్రాలు వల్ల ఉపయోగం లేదని చెప్పారు. కోనసీమ ప్రాంతంలో క్రాఫ్ హాలిడే ప్రకటిస్తున్న రైతులకు ప్రభుత్వం భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కేంద్రం రైతు ఉత్పత్తులు ఎగుమతులు కొనసాగాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు. అందుచేత.. బీజేపీని ప్రజలు ఆత్మకూరులో గెలిపిం చాలని.. సోము పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని సోము చెప్పారు.
వాలంటరీ వ్యవస్థ వైసీపీ వాడుకొంటోందన్నారు. ఆత్మకూరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. మొత్తానికి సోము వీర్రాజు వీరావేశంతో చేస్తున్న ఈ ప్రచారానికి మెరుపులు మెరవకపోగా.. విమర్శలు జోరందుకుంటున్నాయి. ఇదేమన్నా.. సార్వత్రిక సమస్యా.. అంటూ.. బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం.