Begin typing your search above and press return to search.

కేటీఆర్ పై సోము వీర్రాజుకు కోపం ఎందుకొచ్చింది?

By:  Tupaki Desk   |   27 Dec 2022 3:30 PM GMT
కేటీఆర్ పై సోము వీర్రాజుకు కోపం ఎందుకొచ్చింది?
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. వాళ్లు ఏ రాష్ట్రం వెళ్లైనా సరే తొడగొడుతున్నారు. అధికారం లేని రాష్టాల్లోనూ తగుదునమ్మా అని పుల్లలు పెడుతున్నారు. ఏపీలోనూ అంతే..కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని నేతలు కూడా అధికారంలో ఉండి ప్రజాదరణ కలిగిన వారిపై నోరు పారేసుకుంటున్నారు.

తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు కోపం వచ్చేసింది. సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఇక్కడ బీజేపీ పోటీచేసి ఘోరంగా ఓడిపోయింది.

దీనిపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో బీజేపీకి అసలు స్థానం లేదని తేలిపోయిందని’ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించిన బీజేపీకి అంత సీన్ లేదనడంపై సోము వీర్రాజు బాగా హర్ట్ అయ్యారు. అందుకే తన రాష్ట్రం కాకున్నా తెలంగాణ పాలిటిక్స్ పై బరెస్ట్ అయ్యారు. బీజేపీ వాదిగా రంగంలోకి దిగి రెచ్చిపోయారు.

ఎస్సీ పథకాలు రద్దు చేసిందని జగన్ సర్కార్ పై ఉద్యమిస్తూ గుంటూరులో ధర్నా చేసిన సోము వీర్రాజు అక్కడ తెలంగాణ రాజకీయాలు మాట్లాడడం అందరినీ విస్తుపోయేలా చేసింది. మొదట సీఎం జగన్ పై విమర్శలు చేసిన సోము వీర్రాజు అనంతరం బీజేపీకి అంత సీన్ లేదన్న కేటీఆర్ పై పడ్డాడు. ‘కేసీఆర్ ఫ్యామిలీ పార్టీ అని.. అబద్ధాలు మాట్లాడుతుందని.. కూతురు, కొడుకు ఇలా అందరూ అబద్దాల కోరులు అని.. ఈ బయట మాట్లాడే బదులు తనతో చర్చకు వస్తే కడిగిపారేస్తాను అంటూ ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు.

తనతో కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సోము తొడగొట్టాడు. కేటీఆర్ ది నోరా తాటిమట్టనా? బీజేపీని అలా అంటావా అని మండిపడ్డారు. తనతో కూర్చుంటే కేటీఆర్ ను వాయించి పడేస్తానన్నారు.

తెలంగాణ బీజేపీ నేతలే స్పందించని ఇష్యూమీద ఏపీ బీజేపీ చీఫ్ స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కేటీఆర్ పై సోము వీర్రాజు విరుచుకుపడాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. ఇంత రెచ్చిపోవడం ఎందుకో ఏపీ బీజేపీ నేతలకు కూడా అర్థం కాలేదు. ఏపీలో అసలే లేని బీజేపీని.. తెలంగాణలో లేదనడంతోనే సోము వీర్రాజు హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అందుకే ఇలా బరెస్ట్ అయ్యాడు కావచ్చు. బండి సంజయ్ పట్టించుకోకున్నా సోము వీర్రాజు మాత్రం దీనిపై హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.