Begin typing your search above and press return to search.

సోము వీర్రాజు కాదు.. మూర్ఖ వీర్రాజంట

By:  Tupaki Desk   |   17 May 2016 4:50 AM GMT
సోము వీర్రాజు కాదు.. మూర్ఖ వీర్రాజంట
X
భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడటం అవసరం. చుట్టూ పరిస్థితులకు తగ్గట్లుగా మాట్లాడితే జనామోదం ఉంటుంది. అంతే తప్పించి అధినాయకత్వానికి భజన చేసే బ్యాచ్ గా మారిపోతే ప్రజల మనసుల్ని దోచుకోవటం సంగతి తర్వాత.. ఛీదరించుకోవటం ఖాయం.తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాటలు ఇదే తీరులో ఉన్నాయి. వార్డు మెంబరుగా గెలవలేని సోము వీర్రాజు లాంటి వారిని ఎమ్మెల్సీని చేస్తే ఇదే తీరులో ఉంటుందన్న విమర్శలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయం మీద పలువురు సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. అందుకు భిన్నంగా ఆంధ్రోడు అయి ఉండి సోము వీర్రాజు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం. ఏపీ రాజధాని కోసం నిధులు అడుగుతున్న వైనాన్ని ప్రశ్నిస్తున్న ఆయన.. రాజధాని కోసం ఇంతగా వెంపర్లాడిన రాష్ట్రాన్ని తాను చూడలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దేశంలో విభజనకు గురైన ఏ రాష్ట్రం కూడా రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. విశాఖలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడిన ఆయన.. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడినా ఏ రాష్ట్రం కూడా రాజధాని కోసం ఇంతలా వెంపర్లాడలేదని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఏపీ రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయిలు అడగటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు తమ భూముల్ని ఉచితంగా ఇచ్చారంటున్న వీర్రాజు.. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్లు అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన ప్రజలకు ఏపీ సర్కారు ఇస్తున్న ప్యాకేజీ.. పరిహారం.. ప్రతిఏటా ఇచ్చే మొత్తం లాంటివేమీ వీర్రాజు లెక్కలో వేసుకోరేమో..? ఇవన్ని ఒక ఎత్తు అయితే.. అమరావతి కోసం కేంద్రం 20వేల కోట్లు ఇప్పటికే ఇచ్చినట్లుగా వీర్రాజు చెప్పుకొచ్చారు. చూస్తుంటే.. బీజేపీ అధినాయకత్వం మీదున్న అభిమానంతో కళ్లు బైర్లు కమ్మి వాస్తవాల్ని చూడటం మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఏ నేత అయినా తన ప్రాంతానికి మేలు జరుగుతుందంటే మరిన్ని నిధులు కావాలని కోరుకోవటం సహజం. కానీ.. వీర్రాజు మాత్రం అందుకు భిన్నంగా మాకు నిధులు ఎందుకని మాట్లాడుతున్న వైనాన్ని చూపిస్తూ.. ఆయన్ను సోము వీర్రాజు అనే కంటే మూర్ఖ వీర్రాజు అని పిలవటం మేలన్న మాట పలువురి నోట బలంగా వినిపిస్తోంది. తాను చెప్పే మాటలతో ఏపీ ప్రజల్లో తన మీద పెరుగుతున్న ఆగ్రహాన్ని వీర్రాజుగుర్తించారా..? అదే సోయి ఉండి ఉంటే.. సోము వీర్రాజు నోటి నుంచి ఈ తరహా మాటలు రావేమో..?