Begin typing your search above and press return to search.

టీడీపీపై వీర్రాజు కొత్త ఆరోప‌ణ‌

By:  Tupaki Desk   |   20 Dec 2017 12:34 PM GMT
టీడీపీపై వీర్రాజు కొత్త ఆరోప‌ణ‌
X
మిత్ర‌ప‌క్షం, అందులోనూ అధికారం పంచుకుంటున్న పార్టీ అయిన‌ టీడీపీపై బీజేపీ నాయ‌కుడు - ఎమ్మెల్సీ సోము వీర్రాజు త‌న దూకుడును ఏ మాత్రం త‌గ్గించడం లేదు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషిస్తూ...సీట్లు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరుకున్నామ‌ని చెప్పిన వీర్రాజు...ఈ సంద‌ర్భంగా త‌మ ఎదుగుద‌ల‌ను టీడీపీ ఓర్వ‌లేక‌పోతోంద‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీడీపీ కౌంట‌ర్ ఇచ్చిన‌ప్ప‌టికీ...వీర్రాజు త‌న దూకుడు కొనసాగిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న‌ అవినీతిపై విరుచుకుప‌డ్డారు. టీడీపీ పాల‌న కంటే ఇత‌ర అంశాల‌పైనే ఎక్కువ దృష్టి సారించింద‌ని ఆరోపించారు. టీడీపీ చేయాల్సింది ట్రేడింగ్ కాదు రూలింగ్ అంటూ విమ‌ర్శ‌లు చేశారు. నిధుల గురించి పాల‌కులు గ‌గ్గోలు పెడుతున్నార‌ని అయితే...ఇసుక - ఎన్ ఆర్జీ ఎస్ - ఎర్ర చందనం - గ్రానైట్ నిధులు ఎక్కడికి పోతున్నాయని వీర్రాజు సూటిగా ప్ర‌శ్నించారు.

దీంతో పాటుగా ప్ర‌భుత్వంలో త‌మ‌కు స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని మ‌రోమారు వీర్రాజు ఆరోపించారు. త‌మ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడైన మంత్రి మాణిక్యాల‌రావుకు క‌నీస గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. కాకినాడ‌లో త‌మ‌కు కేటాయించిన సీట్ల‌లో టీడీపీ పోటీచేసింద‌ని పేర్కొన్న వీర్రాజు ఈ విష‌యంలో వాస్త‌వాలు మ‌రుగున ప‌రిచి ఆ ఎన్నిక‌ల్లో గెలుపుపై వ‌క్ర‌భాష్యం చెప్తోంద‌ని మండిప‌డ్డారు.