Begin typing your search above and press return to search.
‘ది గ్రేట్ సోము కామెడీ షో!’
By: Tupaki Desk | 11 March 2018 1:55 PM GMTఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇన్నాళ్లూ చంద్రబాబు వ్యతిరేక ప్రసంగాలకు పేరుమోసిన వ్యక్తిగా కీర్తి గడించారు. ఇప్పుడు ఆ పనికూడా తగ్గిపోయింది. తెలుగుదేశంతో భాజపా మిత్రపక్షంగా ఉన్నప్పుడు.. ఆ పార్టీని వీరు తిడితే.. ఆ మాటలు కొంచెం స్పైసీగా ఉంటాయనడంలో సందేహం లేదుగానీ.. ఇద్దరూ శత్రు పక్షాలు అయిపోయిన తర్వాత.. వారి తిట్లకు స్పైసీ యాంగిల్ ఎందుకు ఉంటుంది? సహజంగానే సోము వీర్రాజు మాటలకు కూడా మీడియాలో ప్రాధాన్యం తగ్గిపోయింది.
అందుకే ఆయన కొత్త ప్రచారాలను నమ్ముకున్నట్లుగా కనిపిస్తున్నది. కాకపోతే.. సోము వీర్రాజు మాటలు నిన్నటిదాకా చంద్రబాబు మీద నిప్పులు చెరగుతున్నంత కాలమూ.. ఫైర్ బ్రాండ్ లాగా ఉండేవి. ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు వింటోంటే.. కమెడియన్ లాగా అనిపిస్తున్నాయి.
ఇంతకూ సోము ఏం చెబుతున్నారంటే... ఇతర పార్టీల్లోనీ చాలా మంది నాయకులు భాజపా లోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్నారుట. భాజపా అధిష్టానంతో టచ్ లో ఉంటూ.. త్వరలోనే కమలతీర్థం పుచ్చుకోవడానికి ఉత్సాహ పడుతున్నారుట. ఇదేమీ ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. అచ్చంగా ఏపీ రాజకీయాల గురించే సెలవిస్తున్నారు.
వాస్తవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా పరిస్థితి మరీ దయనీయంగా తయారైపోయిందని ప్రజలంతా అనుకుంటున్నారు. చంద్రబాబు చేస్తున్న విష ప్రచారానికి - భాజపా నాయకులు తలా తోకా లేకుండా తమ కేంద్ర ప్రభుత్వపు చర్యలను సమర్థించుకుంటున్న పాపానికి ప్రజలందరూ ఆ పార్టీని ఛీకొడుతున్నారు.
ఆ పార్టీని నమ్ముకున్న వారికి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని.. ఏపీ పరిధిలో.. ఆ పార్టీలో ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న వారందరికీ.. ఇదే చిట్టచివరి పదవులు అనే జోకులు కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి. ఒకవైపు ఇలాంటి ప్రచారాలు సాగుతూ ఉండగా.. దానికి రివర్సులో ఇతర పార్టీలలోని నాయెకులంతా తమతో జట్టుకట్టడానికి ఎగబడుతున్నారని సోము వీర్రాజు చెబుతుండడం కామెడీ కాక మరేమిటి? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గొప్పలు చెప్పుకున్నా కాస్త అతికినట్లుండాలి గానీ.. మరీ ఇలాగా అని నవ్వుకుంటున్నారు.