Begin typing your search above and press return to search.
బాబు ఆదేశించారు.. సోము వీర్రాజు పాటించారు
By: Tupaki Desk | 4 Feb 2018 10:13 AM GMTబడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు సాక్షిగా నిలదీయాలని.. టీడీపీ ఎంపీలంతా గట్టిగా మాట్లాడాలని ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ ఎంపీలకంటే ముందు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్రబాబు మాటలను అమలు చేశారు. తానూ గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే.. చంద్రబాబు చెప్పినట్లుగా ఆయన కేంద్రంపై గట్టిగా మాట్లాడలేదు. టీడీపీపై చంద్రబాబు చెప్పినకంటే చాలా గట్టిగా మాట్లాడారు.
బీజేపీ నేతలు నిప్పు అయితే .. టీడీపీ నేతలు అవినీతికి వారసులని వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో ఓ మహా నేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్న వారు మీరంటూ టీడీపీని ఉద్దేశించి అన్నారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే తన అజెండా అని తనకు సొంత ఎజెండా లేదని చెప్పారు.
అంతేకాదు, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ లో రూలింగ్ లేదని - ట్రేడింగ్ మాత్రమే జరుగుతోదన్న వీర్రాజు ఆరోపించారు. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని చంద్రబాబును ఆయన ప్రశ్నించారు.
కాగా వీర్రాజు స్పీడు చూస్తుంటే చంద్రబాబు బెదిరింపులకు ఆ పార్టీ ఏమీ అదరలేదు - బెదరలేదని అర్థమవుతోంది. పొత్తు తెంచుకుంటామన్నట్లుగా టీడీపీ నేతలు చేస్తున్న హడావుడికి బీజేపీ నేతలు బెదరకపోగా తిరిగి చంద్రబాబునే డిఫెన్సులో నెడుతున్నట్లు అర్థమవుతోంది.