Begin typing your search above and press return to search.
బాబు బండారం రచ్చకీడ్చిన భాజపా నేత
By: Tupaki Desk | 9 Oct 2015 4:13 AM GMTఇన్నాళ్లకు బీజేపీ రాష్ట్ర శాఖ వాస్తవాలను బయటపెట్టడానికి సిద్ధమవుతోంది. తెలుగుదేశం పాలనలో అడుగడుగునా పేరుకుపోతున్న కంపును సాక్షాత్తూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడిగిపారేశారు. గురువారం బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి నందర్భంగా బాబుగారి నిర్వాకాన్ని మీడియా సాక్షిగా దులపరించి పడేశారు. పోలవరం అథారిటీకి రాష్ట్ర్ర ప్రభుత్వం లెక్కలు చూపలేదని ఆరోపించారు. ఇది మామూలు ఆరోపణ అనుకుని తీసిపారేయవచ్చు కాని పట్టిసీమ బాగోతాన్ని కూడా వీర్రాజు విప్పి చెప్పిన వైనం సంచలనం కలిగిస్తోంది.
పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరాల్లో విడ్డూరమని వీర్రాజు ఆక్షేపించారు. పైగా వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు ఖర్చు చేయడంలేదని తేల్చి చెప్పారు. పైగా కేంద్ర నిధులను బ్యాంకుల్లో పెట్టుకుని వడ్డీలు తింటున్నారని ఆరోపించారు. ఆర్భాటంగా చెప్పుకుంటున్న పట్టిసీమ నుంచి రాయలసీమకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదని వీర్రాజు మండిపడ్డారు. మొత్తం మీద ప్రజలందన్నీ ఏంపీ సర్కారు గందరగోళంలో పడేస్తోందని వాపోయారు.
స్వర్ణాంధ్రప్రదేశ్, అమరావతి బూచిని చూపి పబ్బం గడుపుతున్న చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాలపై ఎవరికైనా అపనమ్మకం ఉంటే మిత్రపక్షం ఎమ్మెల్సీ స్వయంగా చేసిన పై ప్రకటనల సారాంశాన్ని ఒకటికి రెండుసార్లు ఎవరికి వారు పరిశీలించి నిగ్గు తేల్చుకోవచ్చు. రుణమాఫీ ప్రకటిస్తున్నారు కానీ నిధులను మాత్రం ప్రభుత్వం మంజూరు చేయడం లేదని బ్యాంకులు మొత్తుకుంటుంటే ఏమో అనుకున్న ప్రజలకు ఇప్పుడు చంద్రబాబు తత్వం బాగానే తలకెక్కుతోంది.