Begin typing your search above and press return to search.
భయం లేదనడమే..బాబు భయాన్ని చెప్తోంది
By: Tupaki Desk | 8 Jun 2018 10:32 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారమే ఆయనకు బెడిసికొడుతోందా? పదే పదే ఆయన జపించే మంత్రమే ఆయనకు బూమరాంగ్ అవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమంటున్నారు. చంద్రబాబు నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి రూ.13 కోట్లు విడుదల చేసినట్లు జీవో ఉన్నప్పటికీ...అంతకంటే ఎక్కువే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత వారం రోజులుగా అధికారులు పనిచేయడం లేదని, చంద్రబాబు ప్రచారానికి ప్రజాసేవలను పణంగా పెట్టారని వీర్రాజు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అబద్ధాలతో ప్రచారం చేపడుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా అధికారులు నవ నిర్మాణంలో పాల్గొనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు ఎక్కడ మీటింగ్ కి వెళ్ళిన ఏపీ శక్తి నిరూపిస్తాం అని చెప్పడం ఆయన అభద్రతాభావాన్ని రుజువు చేస్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. `నేను ఎవ్వరికి భయపడను బీజేపీ నన్ను చూసి భయపడుతోందని పదేపదే చంద్రబాబు చెప్పడం వెనుక ఆయన భయం ఆయనకే తెలుస్తోంది. ప్రతిరోజు అభద్రతాభావంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుమారుడు నారా లోకేష్ అపద్రత భావంతో ఉన్నారు. ఎవరికి భయపడను అంటున్నచంద్రబాబు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణ స్వీకార ఉత్సవ కార్యక్రమానికి హాజరయ్యారో తెలపాలి. చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలి`` అని కోరారు. అధికారం కోసం బీజేపీ ఏనాడు తహతహలాడలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు నిర్ణయించారని, కానీ లోకేష్ ను సీఎం చేసేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.
1996లో వాజ్‌పేయిని ప్రధానమంత్రి కాకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆరోపించారు. కుట్రపూరిత మైన రాజకీయ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని మండిపడ్డారు. కేంద్ర పధకాలను తన పధకాలుగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు ఏ బిరుదు ఇవ్వాలో జనమే సూచించాలన్నారు. 11న విజయవాడలో భారీ ధర్నా చేస్తామని వీర్రాజు ప్రకటించారు. ఈనెల 10న విజయవాడలో బీజేపీ సభపెడతామని - నిజాలు చెపుతామని సోము వీర్రాజు తెలిపారు.