Begin typing your search above and press return to search.
కొండవీటి వాగు ప్రవాహం...బాబు అబద్దాలు ఒక్కటే
By: Tupaki Desk | 17 Sep 2018 3:07 PM GMTఅమరావతి కొండవీటి వాగు జాతికి అంకితం చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరును బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. వాగు ఎలా ప్రవహిస్తోందో చంద్రబాబు అబద్ధాలు కూడా అలాగే ప్రవహిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బాబ్లీ విషయంలో నోటీసుల తీరును చంద్రబాబు విధానం చిత్రంగా ఉందన్నారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబ్లీ కేసులో ఉద్దేశపూర్వకంగా కోర్టుకి హాజరు కాకుండా ఇప్పుడు నాన్ బెయిలబుట్ వారెంట్ ఇష్యూ ని ప్రస్తావించటం సిగ్గు చేటని వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులను తొలగించగలరా అని వీర్రాజు ప్రశ్నించారు. ప్రతిదీ మోడీ గారికి భాగస్వామ్యం ఉందని అనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతూ అబద్దాల్లో జీవిస్తున్నారని వీర్రాజు ఎద్దేవా చేశారు. ఒక్క పోర్ట్ కానీ విమానాశ్రయం కానీ ఇప్పటి వరకు కట్టలేకపోయారని, అమరావతి నిర్మాణంపై ఎంతో అస్పష్టత ఉందని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుతూ రాజకీయ విమర్శలను పక్కనపెట్టాలని సూచించారు. ఇండియాటుడే సర్వేలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందనే విషయం స్పష్టంగా ఉందన్నారు. ప్రచారం కోసం ఆతృత పడే బదులుగా ప్రజాసంక్షేమంపై చంద్రబాబు దృష్టి పెట్టాలని వీర్రాజు ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం చంద్రబాబు తీరును తప్పుపట్టారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోడీ చేయించారని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అదే నోటీసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు వారెంట్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రూ.500తో పోయే కేసు మీద ఏదో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారెంట్ల డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. నటుడు నటుడు శివాజీతో ఆపరేషన్ గరుడ డ్రామాను టీడీపీ ఆడిస్తోందని మండిపడ్డారు.
మరో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ అసైన్డ్ భూముల విషయంలో రైతులను ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందన్నారు. న్యాయం చేయమని అడిగిన రైతులను అరెస్ట్ చేయమనడం దారుణమన్నారు. అసైన్డ్ భూములు కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని, అసైన్డ్ భూముల కొనుగోలు జరిగే క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నారు. తక్షణమే అసైన్డ్ భూముల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తారా అని మాధవ్ ప్రశ్నించారు. రాజధానిలో ఎల్ఎల్ఆర్ స్కీం ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునకు లోబడి రాజధాని నిర్మాణం చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.