Begin typing your search above and press return to search.
బాబు తన డప్పుతానే కొట్టుకుంటాడు
By: Tupaki Desk | 27 Jan 2019 9:26 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతా నేను చేశాను... మున్ముందు కూడా నేనే చేస్తా.. అంటూ తన డప్పుతానే కొట్టుకుంటాడని బీజేపీ ఎమ్మెల్సీ సొము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఆదివారం ఏలూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీపై చంద్రబాబు - బాలకృష్ణలు విమర్శలు గుప్పించడాన్ని ఆయన తప్పుబట్టారు.
చంద్రబాబు నాయుడు తనకు బీసీలంతా బ్యాక్ బోన్ అంటూ చెబుతారని అటువంటి ముఖ్యమంత్రి బీసీని ముఖ్యమంత్రి చేయగలరా అని ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన మోడీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం 7వేల కోట్లు ఇస్తే కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదని చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. బాబు నైతికత లేదని విమర్శించారు. బాబు పోలవరం కట్టలేక తాళ్లపూడి - పుష్కరం ఎత్తిపోతలు కట్టారని విమర్శించారు. పోలవరాన్ని నాటి దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారని స్పష్టం చేశారు.
ఇక అమరావతి రాజధాని తాత్కాలిక నిర్మాణాలు చూపించడానికి వేల కోట్లు పెట్టి గ్రాఫిక్స్ ప్రజలకు చూపిస్తున్నారని ఆరోపించారు. బాబు బస్సు యాత్రలతో ఆర్టీసీ దివాలా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. బస్సు యాత్రకు ఆర్టీసీ నుంచి వెయ్యి బస్సుల వరకు ఉపయోగిస్తుండటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.
మేలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాం ఇవ్వాల్సి ఉందని - కనీసం ఇప్పటి వరకు యూనిఫాం కుట్టిన వారికి డబ్బులు చెల్లించిన పరిస్థితి లేదని అలాంటి బాబు డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు ఇస్తానంటూ గొప్పలు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏదైనా తానే చేశానని చెప్పుకుంటాడని.. ఐటీ, డ్వాక్రా నేనే ఇచ్చానంటాడు.. డ్వాకా ను వాజ్ పేయి ఇచ్చారని.. ఇక ఐటీని చంద్రబాబు నాయుడు తేలేదని కేసీఆర్ ఇదివరకే నిరూపించారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తన గొప్పే అని చంద్రబాబు నాయుడు సొంత డబ్బా కొంటుకుంటాడని వీర్రాజు ఆయనపై మండిపడ్డారు.