Begin typing your search above and press return to search.
ఆ మాట మాట్లాడితే బాబు నాలుక చీలుస్తానన్నాడు!
By: Tupaki Desk | 4 April 2019 10:37 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తల్లి గురించి సీఎం చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారని.. అలా మరోసారి చేస్తే ఆయన నాలుక చీరుస్తానని తీవ్రంగా మండిపడ్డారు.
ఐదేళ్లుగా అవినీతి అక్రమాలు చేసిన చంద్రబాబు దొంగ లెక్కలు చూపించి అవార్డులు దక్కించుకున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ది కోసం కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు నిధులు విడుదల చేస్తే.. వాటిని దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. కేంద్రం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి తానే వాటిని ప్రవేశ పెట్టినట్లుగా బాబు గొప్పలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి కేంద్రం రూ.7వేల కోట్లు విడుదల చేస్తే.. బాబు ఆ నిధులను తన సొంత కార్యక్రమాలకు వాడుకున్నట్లుగా వీర్రాజు వెల్లడించారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదన్న ఆయన.. ముఖ్యమంత్రి అవినీతిపై చర్చ పెడతామన్నారు. తాను పెట్టే చర్చకు చంద్రబాబు వచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. విమర్శలు.. ఆరోపణలు.. సవాళ్లు రాజకీయాల్లో మామూలే అయినా.. మా మోడీ తల్లిని ఉద్దేశించి మాట్లాడితే మాత్రం నాలుక చీరేస్తామంటూ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.