Begin typing your search above and press return to search.

పవన్ ఆ అవకాశాన్ని మిస్ చేశారు!

By:  Tupaki Desk   |   6 April 2019 6:34 PM GMT
పవన్ ఆ అవకాశాన్ని మిస్ చేశారు!
X
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు బీజేపీ నేత సోము వీర్రాజు. రాష్ట్రంలో ఒక సామాజికవర్గానికి అధికారం ఇవ్వాలని తాము ఆయనను ఆహ్వానించామని.. అయితే పవన్ కల్యాణ్ రాలేదని.. తద్వారా ఆయన ఆ సామాజికవర్గం అవకాశాలను మిస్ చేశారంటున్నారు సోము. వరసగా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారాయన. ఈ విషయంలో ఈ బీజేపీ నేత నర్మగర్భంగా మాట్లాడినా.. ఆయన ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టం అవుతోంది.

తమ పార్టీ తరఫున కాపులకు అవకాశం దక్కేదని, పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాము వెళ్లే వాళ్లమని సోము వీర్రాజు ఇన్ డైరెక్టుగా చెబుతూ ఉన్నారు. రాష్ట్రంలోని ఒక సామాజికవర్గానికి తాము అధికారం ఇవ్వాలని అనుకున్నట్టుగా సోమూ వ్యాఖ్యానించారు. తద్వారా పవన్ కల్యాణ్ ను ముందు పెట్టుకుని కాపు సామాజికవర్గం సమీకరణంతో ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేసినట్టుగా సోము చెబుతున్నారు.

ఈ విషయంలో తాము స్వాగతం పలికినా - పవన్ కల్యాణ్ ముందుకు రాలేదని ఆయన అన్నారు. గతంలో సోము వీర్రాజు కు - పవన్ కల్యాణ్ కు సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ సిఫార్సుతోనే సోముకు ఎమ్మెల్సీ పదవి లభించిందని వార్తలు వచ్చాయి కూడా. ఇప్పుడు ఈ విషయాన్ని ఆయనే చెబుతూ ఉండటం గమనార్హం.

ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడు లోకేష్ లపై సోము వీర్రాజు విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేష్ అవినీతికి డైరెక్షన్ చేస్తూ ఉంటారని అన్నారు. పవన్ కల్యాణ్ సామాజిక స్థితిగతులను మార్చలేని ఒక వ్యక్తిగా - ఒక ప్రశ్నగానే మిగిలిపోయారని సోము ఎద్దేవా చేశారు.