Begin typing your search above and press return to search.
టీడీపీ నేతలకు వీర్రాజు వార్నింగ్ ఇది
By: Tupaki Desk | 17 May 2017 12:27 PM GMTకొద్దిరోజులుగా టీడీపీ-బీజేపీల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా మారే వాతావరణం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవడంపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీని రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు కలవడం తప్పు అన్నట్లు అవమానకరంగా మాట్లాడుతున్నారని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఎందుకింత అసహనం అని వీర్రాజు ప్రశ్నించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చెప్పామని, ఏం చేయాలనేది త్వరలోనే తేలుస్తామని పేర్కొన్నారు. మోడీని రాజకీయ నాయకులు ఎందుకు కలవకూడదో టీడీపీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. తమను అడ్డుకోవడమే పనిగా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా టీడీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ అభ్యంతరం తెలిపారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తే ఊరుకోబోమన్నారు. కేంద్రంలో బీజేపీతో కలిసీ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉంటూ తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వీర్రాజు నిలదీశారు. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో తమ పార్టీని విస్తరిస్తామని వీర్రాజు స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/