Begin typing your search above and press return to search.
బద్వేల్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు: సోము వీర్రాజు
By: Tupaki Desk | 31 Oct 2021 9:56 AM GMTబద్వేలు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని అందుకే ఓటింగ్ శాతం మొదట ఒకటి చెప్పి అనంతరం పెంచారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. బద్వేలులో జరిగిన పోలింగ్ సరళిని చూస్తే 55వాతం కూడా ఓటింగ్ మించకూడదని.. కానీ దొంగ ఓట్లు వేసుకొని ఓటింగ్ శాతానని 68శాతానికి పెంచారని సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇలా దొంగ ఓట్లు వేయించి గెలవాలని చూస్తోందని సోమువీర్రాజు ఆరోపించారు. ఆ కారణంగానే ఎక్కువ ఇన్ చార్జిలను పెట్టుకున్నారని ఆరోపించారు. మండలాల వారీగా ఇన్ చార్జులుగా ఉన్న వైసీపీ నాయకులు.. బీజేపీ ఏజెంట్లను ఎందుకు బెదిరించారని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికను తలపించారని దుయ్యబట్టారు.
బద్వేలులో దొంగ ఓటర్లు బారులు తీరారని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రొద్దుటూరు, కడప నుంచి స్థానికేతరులను ప్రత్యేక వాహనాల్లో తరలించారని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో అడుగడుగునా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని నిప్పులు చెరిగారు.
బద్వేలులో 28 చోట్లలో రీపోలింగ్ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ లాగా దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే వాళ్లు బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారని ఫైర్ అయ్యారు.
ఇక వైసీపీ నేతలు బద్వేలులో అడుగడుగనా దొంగ ఓట్లు వేయించుకున్నారని బీజేపీ మరో కీలక నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఆ దొంగ ఓట్ల కారణంగానే మొదట 53 శాతం పోలింగ్ అని.. తర్వాత 68 శాతానికి పెంచారని మండిపడ్డారు. మంత్రులు ఎమ్మెల్యేలు బద్వేలులోనే తిష్టవేసి ఇదంతా చేశారని విమర్శించారు.