Begin typing your search above and press return to search.
జగన్ అందుకే బిల్లులు వెనక్కి తీసుకున్నారు: సోము వీర్రాజు
By: Tupaki Desk | 22 Nov 2021 3:39 PM GMTవికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే బిల్లు వెనక్కి తీసుకున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. అధికార వికేంద్రీకరణ వారి సొత్తు కాదని హితవు పలికారు. వికేంద్రీకరణ బీజేపీ కూడా చేసిందని.. కొత్త రాష్ట్రాలు తీసుకొచ్చిందని వివరించారు.
ఒక విధానం ప్రకారం బీజేపీ వికేంద్రీకరణ చేపట్టిందని సోము వీర్రాజు తెలిపారు. కానీ రోడ్డుపై గోతులు మాత్రం పూడ్చలేని వారు అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా.. ఇక్కడే రాజధాని అని సీఎం జగన్ గతంలో చెప్పిన మాటకు సమాధానం ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తాను చెప్పిన మాటకు జగన్ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని స్పష్టం చేశారు.
విశాఖను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు. రాజధానులపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్ని పార్టీలతో చర్చించాలని.. ప్రజాభిప్రాయం సేకరించాలని హితవు పలికారు.