Begin typing your search above and press return to search.
నోరు జారామని బీజేపీకి అర్థమైంది!
By: Tupaki Desk | 25 April 2018 8:33 AM GMTవిమర్శలు రాజకీయాల్లో చాలా కామన్. పార్టీలు ప్రత్యర్థులపై విరుచుకుపడటం కూడా అరుదేం కాదు. తీవ్రమైన విమర్శలు చేసినా తర్వాత క్షమాపణ చెప్పి తప్పించుకోవచ్చు కానీ... సున్నితమైన విమర్శలు కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవుతాయి. దానిని కనుక అవతలి వారు రాజకీయంగా వాడుకుంటే ఇక విమర్శలు చేసిన వారి పని అంతే. అలాంటిదే తాజాగా బీజేపీ విషయంలో జరిగింది. బీజేపీతో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నాక బీజేపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు మోసకారి - 420 - దగాకోరు అని పెద్దపెద్ద విమర్శలు చేశారు. అవన్నీ పెద్ద ఇబ్బందేం కలిగించలేదు. కానీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబు జాగ్రత్తగా ఉండకపోతే *2019లో అలిపిరి ఘటన రిపీట్ అవుతుంది* అంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు బ్యాక్ ఫైర్ అయ్యాయి.
టీడీపీ ఈ విమర్శను బాగా వాడుకుంది. అంటే మీకు ఇష్టం లేకపోతే చంపేస్తారా? ప‌్రశ్నిస్తే లేపేస్తారా అంటూ టీడీపీ నేతలు బీజేపీ వారిపై విరుచుకుపడుతున్నారు. మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలు చాలా ప్రధానంగా వైరల్ అయ్యాయి. నోటి దూల మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా అని బీజేపీ వాళ్లే భయపడిన పరిస్థితి.
దీని గురించి ఏపీ మంత్రి కేఈ మాట్లాడుతూ గిట్టని వాళ్లను - అడ్డొచ్చిన వాళ్లను చంపేయడమే మీ పద్ధతా అంటూ ప్రశ్నించారు. నిన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలను టార్గెట్ చేసి *నేను ఏపీ కోసం పోరాడుతున్నానని బీజేపీకి కంటగింపుగా మారింది. ఏపీ బాగుపడకూడదు అన్నదే బీజేపీ లక్ష్యం - అందుకే నన్ను చంపేసే కుట్ర జరుగుతోంది. నాకు ఏమైనా చేయతలపెడితే ప్రజలంతా వలయంలా ఏర్పడి నన్నుకాపాడాలి* చాలా నాటకీయంగా సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
విషయం అర్థమైన బీజేపీ ఆ మాటను కవర్ చేసే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదో జరగబోతోందని చంద్రబాబునాయుడు భయపడాల్సిన అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు మిత్రధర్మం పాటించలేదని - 2019 ఎన్నికల్లో నెపం బీజేపీ మీద నెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని... అందుకే అలిపిరి ఘటనను ప్రస్తావించాను. అప్పట్లాగానే ఇపుడు కూడా సానుభూతి పనిచేయదని చెప్పడమే నా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశమే లేదని సోము వీర్రాజు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కాస్త చూసుకుని మాట్లాడితే పోయేదా కదా సోము !