Begin typing your search above and press return to search.

బాబు బండారాన్ని వీర్రాజు బ‌య‌ట‌పెట్టేశారు!

By:  Tupaki Desk   |   23 Feb 2018 8:04 AM GMT
బాబు బండారాన్ని వీర్రాజు బ‌య‌ట‌పెట్టేశారు!
X
బీజేపీ సంచ‌ల‌నం - ఆ పార్టీకి సంబంధించి ఏపీ శాఖ‌లో కీల‌క నేత‌గానే కాకుండా ఏపీ శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న సొము వీర్రాజు... త‌న మిత్ర‌ప‌క్షం టీడీపీని ఏమాత్రం విడిచిపెట్టేలా లేర‌నే చెప్పాలి. ఎంత మిత్ర‌ప‌క్ష‌మైనా... కేంద్రంలో అధికారంలో ఉన్న త‌మ‌పై నిత్యం నింద‌లేసుకుంటూ ముందుకు సాగడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌మ‌ని ప్ర‌శ్నిస్తున్న వీర్రాజు... ఎప్ప‌టిక‌ప్పుడు మీడియా ముందుకు వచ్చేస్తూ... టీడీపీ - ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - టీడీపీ నేత‌లు - మంత్రులు - టీడీపీ పాల‌న‌పై నిప్పులు చెరుగుతూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టికి మొన్న చంద్రబాబును ల‌క్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్య‌లు చేసిన వీర్రాజుపై బీజేపీ అధిష్ఠానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింద‌ని వ‌దంతులు వినిపించాయి. అయితే ఆ వ‌దంతుల్లో ఏమాత్రం వాస్త‌వం లేద‌న్న కోణంలో మ‌రోమారు మీడియా ముందుకు వ‌చ్చిన చంద్రబాబు.. ఈ ద‌ఫా చంద్ర‌బాబును ఏకంగా కోర్టు బోనులో నిల‌బెట్టేసిన చందంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు అవ‌లంబిస్తున్న ద్వంద్వ వైఖ‌రి ఇదేనంటూ వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై అస‌లు టీడీపీ నుంచి నోట మాట రావ‌డం క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. కాసేప‌టి క్రితం విజ‌య‌వాడ వేదిక‌గా మీడియా స‌మావేశం పెట్టిన వీర్రాజు... చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ‌టంతో పాటుగా తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు - కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి - రాష్ట్ర విభ‌జ‌న‌ను అడ్డుకునేందుకు పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రేతో హ‌ల్ చ‌ల్ చేసిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ - ఏపీకి అన్యాయం జ‌రుగుతోందంటూ ఇప్పుడిప్పుడే త‌న‌దైన వాణి వినిపిస్తున్న మాజీ ఎంపీ ఉండ‌వల్లి అరుణ్ కుమార్ త‌దిత‌రులనంతా ఒక్క చుట్టగా చుట్టేసి క‌బ‌డ్డీ ఆడుకున్నారు. మొత్తంగా ఏపీకి న్యాయం చేసిన పార్టీ ఒక్క బీజేపీనేన‌ని చెప్పిన వీర్రాజు... చంద్రబాబు స‌హా మిగిలిన ఏ ఒక్కరూ ఏపీకి అండ‌గా నిల‌బ‌డ‌లేద‌ని త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

వీర్రాజు సంధించిన ఆరోప‌ణ‌లు ఆయ‌న మాటల్లోనే... *ఏపీ ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నది బీజేపీనే. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. హోదా అంటే జైలుకేనంటూ చంద్రబాబు గతంలో వ్యాఖ్యానించారు. అందుకు ఈ మీడియా క‌థ‌నాలే సాక్ష్యం. ప్రత్యేక హోదాతో వచ్చేది రూ.3వేల కోట్లేనని - మనమే ఎక్కువ సాధించామని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాంటి చంద్రబాబును ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? నాడు సీఎం చంద్రబాబు చెప్పినవే.. నేను ఇప్పటి వరకు చెబుతున్నాను. రాష్ట్ర విభజనలోనూ చంద్రబాబు రెండు నాల్కల దోరణి అవలంభించారు. తెలంగాణకు వెళ్లి తాను రాష్ట్రపతికి విభజన లేఖ ఇచ్చానని చెప్పి.. ఆంధ్రాకు వచ్చి సమన్యాయం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. బీజేపీ ఎప్పుడూ రెండు విధాలుగా మాట్లాడలేదు. వాస్తవాల్ని ఒప్పుకునే పార్టీ మాది. చంద్ర‌బాబు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ గురించి ఆలోచించారు కానీ.. ఏపీ 13 జిల్లాల గురించి ఆలోచించారా? విభజన సమయంలో ఏపీకి ఏమీ కావాలో కాంగ్రెస్ గానీ - టీడీపీ గానీ అడగలేదు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఏపీకి న్యాయం కావాలని పోరాటం చేశారు. హోదా 15ఏళ్లు కావాలని వెంకయ్యే అడిగారు. కాంగ్రెస్ వాళ్లు బిల్లులో ఏం పెట్టారు? ఏపీ కోసం టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి - సీఎం రమేష్‌లు సభలో ఏం మాట్లాడారు? 14వ ఆర్థిక సంఘంలో ఏముందో అందరికీ తెలుసు.

వెంకయ్యనాయుడే పోలవరం ముంపు మండలాల గురించి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ - లగడపాటి రాజగోపాల్ పోలవరం ముంపు మండలాల గురించి బిల్లులో పెట్టించారా? ఏపీలో ఒక్క శాసనసభ్యుడు కూడా లేని బీజేపీ పోలవరం ముంపు మండలాలను బిల్లులో పెట్టించి - ఏపీలో విలీనం చేసింది. ప‌క్కా ఆధారాల‌తోనే నేను మాట్లాడుతున్నాను. పోలవరం వద్దని ఓ టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించినా సుజనా చౌదరి పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిందే బీజేపీనే. పోలవరం కోసం ఎంతో కృషి చేశా. ముంపు మండలాల విషయంలో కీలక పాత్ర పోషించా. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో మాట్లాడా. నాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా ఏపీ ప్రయోజనాలే మాకు ముఖ్యమని తాను తేల్చి చెప్పా. భద్రాచలంను కూడా ఏపీలో కలపాలని డిమాండ్ చేశా. కానీ, కేసీఆర్, హరీశ్ రావులు విద్యుత్ ప్రాజెక్టులు, తదితర అంశాలతో భద్రాచలంను విడిచిపెట్టలేదు. మిగతా 7 మండలాలను ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అంతేగాక, సోనియా గాంధీ కాళ్ల మీద పడి భద్రాచలంను తెలంగాణలోనే ఉండేట్లు చూసుకున్నారు* అని వీర్రాజు త‌న‌దైన రేంజిలో ఫైరైపోయారు. మ‌రి వీర్రాజు కామెంట్ల‌కు టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.