Begin typing your search above and press return to search.
బీజేపీ ప్రచార కార్యదర్శిగా చంద్రబాబు..
By: Tupaki Desk | 8 Jun 2018 6:13 AM GMTఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబులకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అదిరిపోయే సెటైర్లు వేశారు. శుక్రవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన వారిద్దరి తీరును ఎండగట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ లకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఏ ప్రయోజనం లేని నవనిర్మాణ దీక్షల కారణంగా ఏపీలో వారం రోజులుగా ప్రభుత్వ పాలన నిలిచిపోయిందని మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షల కోసం రూ.50 కోట్లు వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోతుందని బాబు - లోకేష్ లు భయపడిపోతున్నారని.. కానీ బీజేపీకి ఎలాంటి భయాలు లేవని స్పష్టం చేశారు..
తెల్లవారి లేచిన దగ్గరనుంచి ప్రధాని నరేంద్రమోడీ నామస్మరణ చేస్తూ బీజేపీకి చంద్రబాబు గౌరవ ప్రచార కార్యదర్శిగా మారారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. నిత్యం ప్రధాని పదవిని వదులుకున్నానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును ప్రధానిని చేస్తానని ఎవరు హామీ ఇచ్చారో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు చెబితేనే పెన్షన్లు ఇస్తున్నారని.. అర్హులకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీజేపీ నేతలపై టీడీపీ నేతల దాడులకు నిరసనగా ఈనెల 11న విజయవాడలో ధర్నా చేపట్టనున్నట్లు సోము వీర్రాజు ప్రకటించారు.