Begin typing your search above and press return to search.
సోము వీర్రాజు అపాయింట్ మెంట్ అడిగిన సుజనా..'నో' అన్న బీజేపీ చీఫ్!
By: Tupaki Desk | 8 Aug 2020 1:30 PM GMTఇన్నాళ్లు టీడీపీ బ్యాచ్ ది ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ...టీడీపీ అధినేత చంద్రబాబు ఏ సమస్యను ఎత్తుకుంటే దాన్ని టేకప్ చేసి బాగా సహకరించేవారన్న ఆరోపణలున్నాయి. కానీ బీజేపీ అధిష్టానం ఓ ఫైన్ మార్నింగ్ కన్నాను పక్కనపెట్టి ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ పగ్గాలు ఇవ్వడంతో టీడీపీ ఆశలు అడియాశలయ్యాయి. కన్నా లాగా సోము వీర్రాజు టీడీపీకి సహకరించే నేత కాదు.. చంద్రబాబుకు ఆయనకు అస్సలు పడదు. ఇది వరకు విమర్శలు చేశారు.దీంతో సోము వీర్రాజును మచ్చిక చేసుకునే ప్రయత్నాలను టీడీపీ లాబీ మొదలుపెట్టిందన్న ప్రచారం సాగుతోంది.
పొలిటికల్ లాబీయింగ్ చేయడంలో దిట్ట అయిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి ఏపీ బీజేపీ అధ్యక్షుడి దగ్గర బోల్తా పడ్డాడనే ప్రచారం సాగుతోంది. కన్నా లక్ష్మీనారాయణను తన బుట్టలో వేసుకున్న సుజనా చౌదరి.. సోము వీర్రాజును ముగ్గులోకి దింపడం అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఇటీవల సోమును కలవాలని సుజనా అపాయింట్ మెంట్ అడిగినా వీర్రాజు నో చెప్పారనే ప్రచారం సాగుతోంది. ఆర్ ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సోము వీర్రాజు అంత ఈజీగా సుజనా ట్రాప్ లో పడడు అని పాత బీజేపీ నాయకులు అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారట.. రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలు వచ్చే బీజేపీని చెడగొడుతున్నారని ఆవేదన ఏపీ బీజేపీ పాత నేతల్లో ఉంది.
అయితే సుజనా మాత్రం సోము వీర్రాజును లొంగదీసుకోవడానికి ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరి నుంచి లాబీయింగ్ చేద్దాం అని అనుకున్నాడట.. అయితే అమిత్ షా కరోనా సోకి ఆస్పత్రిలో ఉండడంతో సుజనాకు ఎటూ పాలుపోవడం లేదట.. అందుకే సుజనా అమరావతి వచ్చి టీడీపీ మౌత్ పీస్ గా గాండ్రించే పరిస్థితి లేదు అని పెద్ద ఎత్తున ఏపీ బీజేపీలో చర్చ జరుగుతోంది.
మొత్తానికి సోము వీర్రాజు దెబ్బకు సుజనాకు తలుపులు మూసుకుపోయాయని.. ఇక ఆయన టీడీపీ అనుకూల రాజకీయానికి చరమ గీతం పాడినట్టేననే వాదన ఏపీలో బీజేపీలో సాగుతోంది.