Begin typing your search above and press return to search.
గుంటూరులో దాని పేరు మార్చకపోతే కూల్చేస్తాం.. సోము వీర్రాజు సంచలనం..!
By: Tupaki Desk | 30 Dec 2021 5:30 PM GMTఏపీ రాజకీయాలు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసే వ్యాఖ్యలు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడలో జరిగిన సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే అవుతుంది. బిజెపి నేతలు ఏం మాట్లాడినా ? మీడియాలో కూడా ప్రధానంగా హైలెట్ అవుతున్నాయి. సామాన్య ప్రజలలో కూడా ఇప్పుడు బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి చర్చ నడుస్తోంది. తాజాగా మద్యంపై సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సోము వీర్రాజు వ్యాఖ్యలు కలకలం రేపుతుండగానే... ఇప్పుడు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు... ఇప్పుడు ఏపీ రాజకీయాలతో పాటు పక్కనే ఉన్న తెలంగాణ రాజకీయాల్లోనూ ఓ కుదుపు కుదుపుతున్నాయి. గుంటూరులో జిన్నా టవర్ పేరు ఏంటి అని.... ఒక దేశద్రోహి పేరు ఉండటం ప్రజలకే అవమానం అని బిజెపి నాయకులు విరుచుకుపడుతున్నారు. మీరు దాని పేరు మారుస్తారా ? లేదా దానిని కూల్చమంటారా ? అంటూ బీజేపీ నేతలు అల్టిమేటం కూడా ఇచ్చారు.
దేశ విభజనకు ముందు లక్షలాది మంది చనిపోవడానికి కారణమైన దేశద్రోహి జిన్నా పేరు ? గుంటూరులో ఓ టవర్‌కు ఎలా ? పెడతారు అంటూ ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఈ వివాదాన్ని పెద్దదిగా చేసి దేశభక్తిని రగిలించేందుకు వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆజాదీగా అమృత మహోత్సవం సందర్బంగా సోము వీర్రాజు చేసిన ట్వీట్లో విభజనకు కారకులైన వారి పేర్లతో ఇంకా రాష్ట్రంలో జంక్షన్లు, రోడ్లు ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
అఖండ భారత్‌ను ముక్కలు చేసి పాకిస్తాన్ ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి జిన్నా అని ఆయన మండిపడ్డారు. దేశద్రోహుల పేర్లు ఉంటే స్వాతంత్య్ర సమరయోధులకు మనం ఇచ్చే విలువ ఏంటని ప్రశ్నించారు. దేశద్రోహుల పేర్ల స్థానంలో స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.