Begin typing your search above and press return to search.
బాబు సరైనోడు కాదట... సోము స్టడీ చేసీ మరీ చెప్పారు
By: Tupaki Desk | 28 Aug 2019 1:30 AM GMTఏంటేంటీ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సరైనోడు కాదా? ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదినరేళ్ల పాటు, నవ్యాంధ్రకు ఐదేళ్ల పాటు పనిచేయడమే కాకుండా... విపక్ష నేతగా పదేళ్లు పనిచేసి, ఆపై మంత్రిగా, టీడీపీకి సుదీర్ఘ కాలం పాటు అధినేతగా కొనసాగుతున్న చంద్రబాబు సరైనోడు కాదా? ఇదేదో... చంద్రబాబు అంటే గిట్టని వైసీపీ నేతలు చెబుతున్న మాట కాదు. చంద్రబాబు ఎప్పటికప్పుడు జట్టు కడుతున్న బీజేపీకి చెందిన ఏపీ కీలక నేత స్టడీ చేసి చెబుతున్న మాట. ఆ నేత ఎవరంటే... ఇంకెవరు? సోము వీర్రాజే. టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు పాలనపై తనదైన శైలి విమర్శలు చేసి తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పించిన నేతగా సోము వీర్రాజుకు ఓ అరుదైన గుర్తింపు ఉంది.
ఎందుకో గానీ.. చంద్రబాబు పేరు వింటేనే వీర్రాజు అంతెత్తున ఎగిరిపడతారు. చంద్రబాబు సీఎంగా ఉండగా, టీడీపీతో బీజేపీ దోస్తీ కొనసాగుతున్నా కూడా చంద్రబాబుపై వీర్రాజు తనదైన శైలిలో విరుచుకుపడేవారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మరోమారు మీడియా ముందుకు వచ్చిన వీర్రాజు... చంద్రబాబు మనస్తత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తానేమీ అదాటుగా చెప్పడం లేదని, చంద్రబాబును ఆమూలాగ్రం స్టడీ చేశాకే ఈ మాటలు చెబుతున్నానని కూడా వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సరైన వ్యక్తి కాదని సంచలన వ్యాఖ్య చేసిన వీర్రాజు... చంద్రబాబును బాగా స్టడీ చేసిన తర్వాతే ఈ విషయం తనకు బోధపడిందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మయాజాలం కారణంగానే రాజధానిపై ఇంకా గందరగోళం కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని తనదైన శైలి ఆరోపణలు గుప్పించిన వీర్రాజు... చంద్రబాబు హయంలో జరిగిన వేల కోట్ల అవినీతిపై వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పచ్చగడ్డి పథకంలోనూ టీడీపీ నేతలు వేల కోట్లు మేసేశారని కూడా వీర్రాజు తనదైన మార్కు కామెంట్లు చేశారు. అవినీతి చేసి జైల్లో ఉండాల్సిన టీడీపీ నేతలు... ఇంకా బయటే ఉన్నారని, అధికారం కోల్పోయాక సైలెంట్ గా ఉండాల్సిన తమ్ముళ్లు పేట్రేగిపోతున్నారని కూడా వీర్రాజు మండిపడ్డారు.