Begin typing your search above and press return to search.

బీజేపీ లోకి వైసీపీ ఎంపీలు..మేము ఎందుకు కరెక్ట్ గా ఉండాలి?

By:  Tupaki Desk   |   21 Nov 2019 11:31 AM GMT
బీజేపీ లోకి వైసీపీ ఎంపీలు..మేము ఎందుకు కరెక్ట్ గా ఉండాలి?
X
ఏపీలో వలసల రాజకీయం కొనసాగుతోంది. ఎన్నికల హడావిడి తగ్గినా కూడా వలసల రాజకీయం మాత్రం ఆగడంలేదు. ఇప్పటికి ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు కావొస్తుంది. అయినప్పటికీ ఇంకా ఏపీలో ఎన్నికల వాతావరణమే కనిపిస్తుంది. టీడీపీ నుండి కొందరు ఇప్పటికే బీజేపీలోకి వెళ్లగా ..తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీలో జాయిన్ కావడానికి సిద్ధమైయ్యారు. ఈ తరుణంలో బీజేపీ కీలక నేత .. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. మొన్నటికి మొన్న టీడీపీ మరి కొద్దీ రోజుల్లో ఖాళీ అవుతుంది అంటూ సంచలనం సృష్టించిన ఈయన ..తాజాగా వైసీపీ ఎంపీలు బీజేపీ కి టచ్ లో ఉన్నారంటూ చెప్పి పెద్ద బాంబ్ పేల్చాడు.

ఇప్పటికే..మాజీ మంత్రి దేవినేని ఉమా సైతం ఢిల్లీలో వైసీపికి చెందిన 10-12 మంది ఎంపీలు సర్దుకుంటున్నారని ముందు వారిని సరి చేసుకోవాలని సూచించారు. ఇటువంటి సమయంలో సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయన మాట్లాడుతూ ... ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు ప్రజలు 151 సీట్లతో అధికారం కట్టబెట్టారని - ఇంకా ఎమ్మెల్యేల అవసరం ముఖ్యమంత్రికి ఏంటని ప్రశ్నించారు. అవినీతి అక్రమాల కేసులు వున్నవారిని మేం తీసుకొకూడదంటే ఎలా అని మాట్లాడారు. మేం బలపడాలి. .. మేం కూడా పరిపాలించాలనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చారు. మమ్మల్లి మాత్రమే కరెక్ట్ గా వుండాంటే ఎలా అని వీర్రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. అలాగే తెలుగును తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదని...ఇంగ్లీషు మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే ప్రభుత్వ స్కూల్స్ ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చటానికి అసలు ఇంగ్లీష్ లో చెప్పే టీచర్లు ఉన్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.