Begin typing your search above and press return to search.

సోము లాజిక్ - బీజేపీలో ఉన్న నాయకులంతా బీజేపీ నేతలు కాదట

By:  Tupaki Desk   |   24 Dec 2021 7:32 AM GMT
సోము లాజిక్ - బీజేపీలో ఉన్న నాయకులంతా బీజేపీ నేతలు కాదట
X
రాష్ట్ర బీజేపీలో ఒక కీల‌క విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కొన్ని నెల‌లు గా చెబుతున్న విష‌యంపై ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ట‌. దీంతో ఆయ‌న ఈ విష‌యం చెప్పి చెప్పి.. నేను విరోధం అవుతున్నానే త‌ప్ప‌.. నాకు వ‌చ్చిన ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌ని చెబుతున్నారు. దీంతో ఆయ‌న ఇటీవ‌ల కాలంలో దూకుడు కూడా త‌గ్గించార‌ని అంటున్నారు. స‌రే.. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బీజేపీ ఉన్న నాయ‌కులు అంద‌రూ.. బీజేపీ నేత‌లు కాద‌నేది సోము వాద‌న‌! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇటీవ‌ల రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌.. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నేత‌.. అమిత్‌షా తోనూ.. ఆయ‌న ఇదే విషయం చెప్పార‌ట‌.

``బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. కానీ, బీజేపీ నేత‌లుగా మాత్రం వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. వేరే పార్టీ అధినేత క‌నుస‌న్న‌ల్లో పనిచేస్తున్నారు. ఈ విష‌యం అనేక‌సంద‌ర్భాల్లో నేను చెప్పాను. అయినా. నా మాట వినిపించుకోవ‌డం లేదు. వారు మ‌న పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ఏంటి ప్ర‌యోజ‌నం అంటున్నారు. ఇది కూడా నిజ‌మే అని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఎందుకంటే.. పార్టీ ని డెవ‌ల‌ప్ చేయాల‌నే ఆలోచ‌న సాధార‌ణంగా పార్టీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు.. చేయాలి. అయితే.. బీజేపీలో మాత్రం ఈ త‌ర‌హా ఆలోచ‌న క‌నిపించ‌డం లేదు. ఇదే సోమును క‌ల‌వ‌ర‌పెడుతున్న విష‌యం. గ‌త రెండేళ్ల కాలంలో టీడీపీ నుంచి చాలా మంది నాయ‌కులు వ‌చ్చి చేరారు. వీరంతా కూడా వ్యాపారులు.. లేదా కేసులు ఉన్న‌వారు. అంత‌కుమించి ఎవ‌రూ పార్టీలో చేర‌లేదు. దీని వెనుక‌.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ఆయా నేత‌ల‌కు వ్య‌క్తిగ‌తంగా ఉందని.. పార్టీకి వీరి వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని.. సోము వాద‌న‌.

అంతేకాదు.. వీరు ఎప్పుడు అవ‌కాశం ఉంటే.,. అప్పుడు పార్టీ మారుతుంటార‌ని.. వీరిని న‌మ్ముకుంటే క‌ష్ట‌మ‌ని.. కూడా ఆయ‌న చెబుతున్నారు. కానీ, కంద్రంలోను.. రాష్ట్రంలో నూ లాబీయింగ్ రాజ‌కీయాలు వీరే చేస్తున్నారు. ఇదే విష‌యంపై సోము వాపోతున్నారు. ఇలా అయితే.. పార్టీని న‌డిపించ‌లేమ‌ని.. పార్టీలో ఉన్న‌వారిని అంద‌రినీ.. పార్టీకోసం ప‌నిచేసేలా చూడాల‌ని ఆయ‌న విన్న‌విస్తున్నారు. అయితే.. పార్టీలో ఎవ‌రూ ఆయ‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే కీల‌క నిర్ణ‌యం తీసుకుంటార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.