Begin typing your search above and press return to search.

బాబు మీద సోము : టీడీపీతో జట్టుకు బీజేపీ రెడీనా.....?

By:  Tupaki Desk   |   30 July 2022 12:30 AM GMT
బాబు మీద సోము   :  టీడీపీతో  జట్టుకు  బీజేపీ రెడీనా.....?
X
మరీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడామా అని మూడేళ్ళుగా తెలుగుదేశం తలవని రోజంటూ లేదు. సమర్ధ సీఎం గా ఉన్న తాను ఓడిపోవడం ఏంటి అని చంద్రబాబు మధనపడని రోజూ అంటూ లేదు మరి ఇంతలా బాబు కొట్టుకుంటున్నా ఆయన బుర్రకు అర్ధం కాని విషయాన్ని ఇపుడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడమే బిగ్ ట్విస్ట్.

ఆయన కూడా రెండేళ్ళుగా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి ఏనాడు ఈ తరహా రాజకీయ విశ్లేషణ చేయలేదు. ఈ మాటలు ఎపుడూ చెప్పలేదు. ఇపుడు సడెన్ గా అమరావతిలో బీజేపీ పాదయాత్ర వేళ ఆయనకు బాబు ఎందుకు ఓడారో తెలిసిందా లేక మనసులో ఇదివరకే ఉన్నది ఇపుడు అలా బయటపెట్టుకున్నారా అన్నది తెలియదు కానీ బాబు ఓడిపోయారూ అంటే బీజేపీ చేయిని వీడినందుకే అని తనదైన మాట ఒకటి చెప్పారు.

బాబు 2018లో బీజేపీ నుంచి విడిపోయారు. పైగా ఆ పార్టీని వ్యతిరేకించే కాంగ్రెస్ తో చేతులు కలిపారు. అంతటితో ఆగలేదు. మోడీ మీద చాలా దారుణంగా విమర్శలు చేశారు. దేశమంతా తిరిగి మోడీకి యాంటీగా కూటమి కట్టాలని చూశారు. ఇవన్నీ కూడా బీజేపీ పెద్దలకు ఆగ్రహం కలిగించాయని నాడు చెప్పుకున్నారు. ఇక ఏపీ బీజేపీ నేతలలో చూస్తే సోము వీర్రాజు మొదటి నుంచి బాబుకు వ్యతిరేకిగానే ఉన్నారు.

ఇపుడు ఆయన అంటున్న మాట కాస్తా చిత్రంగా ఉన్నా ఆయన ఒరిజినల్ వాయిస్ నే ప్రతిబింబించింది అని భావించాలి. బాబు మాతో కలవనందుకే ఓడారు అని బయటకు అంటున్నారు. ఓడించామని లోపల అనుకుంటున్నారు అనే అంటున్నారు. ఇక ఇక్కడ మరో మాట ఉంది.

బీజేపీతో బాబు చేతులు కలిపితేనే 2024లో మళ్లీ విజయం అన్న సౌండ్ కూడా ఉంది. మరి ఆ విధంగా చూస్తే బాబు బీజేపీతో చేతులు కలుపుతారా. ఆయన సైడ్ ఓకే అనుకున్నా బీజేపీ పెద్దలు ఏమాలోచిస్తున్నారు.

అసలు ఏపీ బీజేపీ నేతలు సోము వీర్రాజు లాంటి వారు బాబుతో పొత్తు విషయంలో ఈపాటికే మెత్తబడ్డారా. లేక హై కమాండ్ ఆదేశాల మేరకు వారు బాబు మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారా. ఇవన్నీ ప్రశ్నలే. ఇక్కడ మరో తమాషా ఏమిటి అంటే బాబు మెచ్చిన అమరావతికే బీజేపీ ఓటు వేయడం. జై అమరావతి అంటూ పాదయాత్ర చేయడం. తమ విధానం ఏపీకి ఏకైక రాజధాని అని చెప్పడం. ఇవన్నీ చూస్తూంటే ఏదో తెర వెనక జరుగుతోంది అనిపిస్తోంది. మరి చూడాలి ఏంటి జరుగుతుందో.