Begin typing your search above and press return to search.

జగన్ కు సోము వీర్రాజు వార్నింగ్..

By:  Tupaki Desk   |   25 Jan 2022 9:30 AM GMT
జగన్ కు సోము వీర్రాజు వార్నింగ్..
X
ఏపీలో కొత్త పీఆర్సీ జీవోల వ్యవహారం పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలని, కొత్త పీఆర్సీ వద్దని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కానీ, కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం హైకోర్టుకు కూడా చేరుకుంది. మరోవైపు, ఫిబ్రవరి 6 నుంచి సమ్మె చేసేందుకు ఉద్యోగులు రెడీ అవుతున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు పలు విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు మద్దతుగా దీక్ష చేపట్టిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు...జగన్ పై విమర్శలు గుప్పించారు.జగన్ ప్రతిపక్ష నేతగా రోడ్ల మీద తిరిగారని, సీఎం అయిన తర్వాత జగన్ ప్యాలెస్‌లో కూర్చుని జనాన్ని రోడ్లెక్కిస్తున్నారని సోము ఎద్దేవా చేశారు.

ఏపీలో మతతత్వ ప్రభుత్వం అధికారంలో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. గుడివాడలో సంక్రాంతి సందర్భంగా తెలుగువారి సంబరాలను నాని చూడలేకపోయారని, బీజేపీకి హిందూ ధర్మం కావాలని అన్నారు. బీజేపీకి కావాలిసింది ముగ్గులు, గొబ్బెమ్మలు, ధర్మం అని అన్నారు. మన ఆత్మ..భారత జాతి ఆత్మ అని, జగన్ ఆత్మ ఏంటో చెప్పాలని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని మండలాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుందని చెప్పారు.

గిద్దలూరు నుంచి గుంటూరుకు 4వేస్ రోడ్డు వేయాలని జనగ్ వినతి చేయగానే నితిన్ గడ్కరీ ఆమోదించారని, ఏ రాష్ట్ర సీఎం అడిగినా ఆమోదిస్తారని, అది బీజేపీ పాలన అని చెప్పారు. ఏపీలో రోడ్లు అధ్వాన్యంగా ఉన్నాయని, వాటిపై తాము కూడా లెటర్ ఇస్తామని, జగన్ కు దమ్ముంటే, ధైర్యం ఉంటే రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు వేస్తారా అని ప్రశ్నించారు. ఏపీలో లిక్కర్ ను ప్రభుత్వం తయారు చేసి అమ్ముకుంటోందని, మాతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు.

జగన్‌ దగ్గర ఒక ముఠా చేరిందని, ఆ ముఠానే సీఎంకు తప్పుడు సమాచారం ఇస్తోందని విమర్శించారు. కొందరు అధికారులు కూడా సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారని, ఎమ్మెల్యేల బంధువులూ ఇందులో భాగస్వాములేనని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం పెంచి అందరికీ మేలు చేయాలని, ఈ విధంగా చేయడం సరికాదని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 50 వేల కోట్ల ఆదాయం తెస్తామని చెప్పారు.