Begin typing your search above and press return to search.
తండ్రిని చూడకుండానే వెనక్కి వచ్చేసిన ఎంపీ రఘురామ తనయుడు !
By: Tupaki Desk | 18 May 2021 10:30 AM GMTప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎంత హాట్ టాపిక్ గా మారిందో , అంతకంటే ఎక్కువగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా దేనిపైనే చర్చ. అలాగే వైసీపీ ఎంపీ అరెస్ట్ కాగానే ,టీడీపీ , జనసేన , బీజేపీ నేతలు ఆఘమేఘాలపై స్పందించడం , దానిపై వైసీపీ నేతలు స్పందించడం తో కరోనా టైం లో ఏపీలో రాజకీయ కాకరేపుతోంది. తాజాగా ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వార్తలు కూడా కొన్ని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ఈ తరుణంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే .. తన తండ్రిని చూసేందుకు ఎంపీ రఘురామ కృష్ణరాజు తనయుడు భరత్ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి వచ్చారు. తన తండ్రిని చూడడానికి అవకాశం ఇవ్వాలని ఆర్మీ అధికారులను భరత్ అడగ్గా , దానికి ఆర్మీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీనితో కాసేపు ఆ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎంపీరఘురామను కలవడానికి కుటుంబసభ్యులకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు తనయుడిని , మరికొందరిని తిరిగి పంపించారు. దీనితో ఇక చేసేదేమి లేక తండ్రిని చూడకుండానే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి భరత్ వెనుదిరిగారు.ఇకపోతే ,ఇప్పటికే రఘురామ రక్త నమూనాలను వైద్య బృందం సేకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ వైద్య పరీక్షలన్ని కూడా తెలంగాణ జ్యుడీషియల్ అధికారి నేతృత్వంలో కొనసాగుతున్నాయి. సేకరించిన రక్త నమూనాలను వైద్య బృందం ల్యాబ్ కు పంపింది. వైద్య పరీక్షలు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఎంపీ ఆయన ఆరోగ్య పరిస్థితి, వీడియోగ్రఫి, స్టేట్ మెంట్ ను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు జ్యుడిషియల్ అధికారి అందజేస్తారు.